తక్కువ ధరకే కర్నాటకలో ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు.. IRCTC సూపర్ ఆఫర్..
దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక, పర్యాటక ప్రాంతాలు కలిగిన రాష్ట్రంగా కర్ణాటక ఉంది. బెంగళూరు, మైసూరు, కూర్గ్, హంపి, గోకర్ణ, చిక్ మగళూరు, ఉడిపి ప్రాంతాలకు టూరిస్టులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జలపాతాలు, కాఫీ తోటలు, బీచ్ లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, జాతీయ పార్కులు, ఉద్యాన వనాలు, అటవీ ప్రాంతాలు పర్యటకుల్ని ఆకర్షిస్తున్నాయి. అలాగే పర్యటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా కూర్గ్ అందాలను వీక్షించే అవకాశం కల్పించింది. కాఫీ విత్ కర్ణాటక అనే పేరుతో ఈ సూపర్ ఆఫర్ ను సంక్రాంతి సందర్భంగా అందుబాటులోకి తెచ్చింది.
సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో వారం పైగానే సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో ఏదైనా టూర్ కు వెళ్లాలని చూస్తున్నారా..? అయితే తక్కువ ధరకే.. త్వరగా వెళ్లి వచ్చేలా ఓ టూర్ ను తీసుకొచ్చింది IRCTC. ఈ టూర్ ను కాఫీ విత్ కర్ణాటక అనే పేరుతో నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కర్ణాటకలోని కూర్గ్ ప్రాంత అందాలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడి జలపాతాలు, కాఫీ తోటలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు.. అలాగే మైసూరు లో రాజభవనాన్ని సందర్శించే అవకాశం ఉంది.
IRCTC కాఫీ విత్ కర్నాటక పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో భాగంగా.. 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా మైసూర్, కూర్గ్ లోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈ టూర్ జనవరి 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంది. అలాగే ఈ తేదీలు మిస్ అయిన వారికి ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో జర్నీ ఉంటుంది. ఆ తర్వాత మార్చి 4, 11, 18, 25 తేదీల్లోనూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ టూర్ వివరాలు ఓసారి చూస్తే.. తొలిరోజు కాచిగూడ-మైసూర్ ఎక్స్ ప్రెస్(12785) రైలు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలా రాత్రి మొత్తం ప్రయాణించి తెళ్లారి ఉదయం 10 గంటలకు మైసూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు ద్వారా కూర్గ్ చేరుకుంటారు. హోటల్ కు చేరుకుని రెడీ అయ్యాక అబ్బే జలపాతం చూస్తారు. ఆ తర్వాత ఓంకారేశ్వర ఆలయం సందర్శించి నైట్ కు కూర్గ్ లోని హోటల్ చేరుకుంటారు.

ఇక మూడోరోజు భాగమండల, తలకావేరి ప్రాంతాలను చూస్తారు. ఆరోజు రాత్రి కూడా కూర్గ్ లోనే స్టే చేసి.. నాలుగో రోజు మైసూర్ కు వెళ్తారు. మార్గమధ్యలో కావేరి నిసర్గధామ, టిబెటన్ మోనెస్టరీ, బృందావనం గార్డెన్స్ ను సందర్శిస్తారు. రాత్రి మైసూర్ హోటల్ లో బస చేస్తారు. ఇక ఐదో రోజు చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ చూస్తారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రైలు మైసూర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఆరో రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. ఇక ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్, ప్యాకేజీ ధరల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications