బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఈ భారీ పేలుడు దాటికి భవనం పైకప్పు కులిపోయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడ్డాయి.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్2లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘనటపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాణసంచా ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేసిన అధికారులు అక్కడ నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ ఫ్యాక్టరీకి ఎలాంటి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్యలో నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసుల అందదండలతోనే ఈ బాణసంచా తయారు కేంద్రాన్ని నడుపుతున్నట్లు ఆరోపించారు.గోదాంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
At least seven people are killed and several others injured following a massive blast at an illegal firecracker factory at #Duttapukur in #WestBengal's North 24 Parganas district.
— IANS (@ians_india) August 27, 2023
The death figures are likely to increase further, said local police sources, as condition of some… pic.twitter.com/eyOfemoax7
ఈ ఏడాది మే 16న తూర్పు మిడ్నాపూరం్ జిల్లా ఎగ్రాలోని అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఆ ఘటనను మరకముందే మరో పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications