మోడీ ర్యాలీకి కొద్దిముందు పాట్నాలో బ్లాస్ట్, ఒకరి మృతి

Patna
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్లో ఆదివారం ఓ నాటు బాంబు పేలడంతో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్లోని పదవ నెంబరు ప్లాట్ ఫాం వద్ద నాటు బాంబు పేలింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు పేలకుండా ఉన్న మరో రెండు బాంబాలును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.

కాగా, పాట్నాలో ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హూంకార్ ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో మోడీ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో నాటు బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించింది. మోడీ సభకు కొద్ది గంటల ముందే ఈ పేలుడు సంభవించింది.

ఈ ఘటనతో పాట్నాతో పాటు రాష్ట్రంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మోడీ హూంకార్ ర్యాలీకి కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+