అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్స్ వద్దు, పుస్తకాలు తెండి: యోగి ఆదిత్యనాథ్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు లభించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద కుట్ర అని ఆరోపించారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు లభించడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద కుట్ర అని ఆరోపించారు.
దీనిపై జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని కోరుతామని అంతకుముందు యోగి చెప్పారు. అనంతరం, పేలుడు పదార్థాలు దొరకడంపై ఘాటుగా స్పందించారు.

ఎవరికైనా పేలుడు పదార్థం గురించి ముందే తెలియకపోతే అది సాధారణంగా దొరికేది కాదని చెప్పారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడి కోసం చేసిన ప్రయత్నమేనని, నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఎమ్మెల్యేలు ఇకపై అసెంబ్లీలోకి సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని యోగి కోరారు. ఒకవేళ తీసుకు వస్తే వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఫోన్ల బదులు పుస్తకాలు తెచ్చుకుంటే బాగుంటుందన్నారు.












Click it and Unblock the Notifications