నా కుమార్తె ఇంటిలిజెంట్ నిప్పు: సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీద అనేక విదాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. లలిత్ మోడీ వివాదంలో చిక్కుకున్న సుష్మా స్వరాజ్ మీదనే కాకుండ ఆమె కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఇలాంటి విమర్శలు పట్టించుకోరాదని సుష్మా స్వరాజ్ కు ఆమె సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఆమె కుమార్తెకు అక్రమంగా మెడికల్ సీటు ఇప్పించుకున్నారని ట్విట్టర్ లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ ట్విట్లు చూసిన సుష్మా స్వరాజ్ తీవ్రస్థాయిలో నే స్పందించారు. నాకుమార్తె ఇంటిలిజెంట్, ఆక్స్ ఫర్డ్ గ్రాడ్జ్యుయేట్, ఎందుకు లేనిపోని అబద్దాలు చెబుతారు అని సమాధానం ఇచ్చారు. విమర్శలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు.
విదేశాంగ మంత్రి ట్విట్టర్ లో సమాధానం ఇవ్వడంతో ఆ ట్విట్ ను తొలగించారు. సుష్మా కుమార్తె బనసురి న్యాయవాది. గత 7 సంవత్సరాల నుండి లలిత్ మోదీకి న్యాయవాదిగా పని చేస్తున్నారు. లలిత్ మోదీ పాస్ పోర్టు రద్దు కేసును ఆమె వాదిస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications