స్మృతి ఘటనకు ముందే మరో షాక్! చేంజింగ్ రూంలో ఫోన్‌తో వీడియో

ముంబై: గోవాలోని ఫ్యాబ్ ఇండియా దుస్తుల దుకాణంలో రహస్య కెమెరా షాక్ నుండి తేరుకోకముందే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తాను షాపింగ్ చేసిన ఫ్యాబ్ ఇండియా షోరూంలో కెమెరాను గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తాజాగా, కొల్హాపూర్ తారాబాయి పార్క్ ప్రాంతంలోని ఫ్యాబ్ ఇండియా గార్మెంట్స్ షోరూంలో దుస్తులు మార్చుకునే ట్రయల్ గదిలో ఓ మహిళ కొనుగోలుదారు దుస్తులు మార్చుకుంటుండగా అక్కడ పని చేసే ప్రకాశ్ ఆనంద అనే వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.

 Fabindia Store Worker in Kolhapur Arrested for Allegedly Filming Woman in Trial Room

గది తలుపు కింద ఉన్న ఖాళీ స్థలంలో సెల్‌ఫోన్ ఉంచి రహస్యంగా చిత్రీకరిస్తుండగా సదరు మహిళ దానిని గుర్తించింది. అనంతరం అందరినీ అప్రమత్తం చేసింది. వెంటనే అతను తన ఫోన్లోని దృశ్యాలను తొలగించాడు. సీసీటీవీ కెమెరా ఆధారంగా అతను చిత్రీకరించినట్లు గుర్తించారు.

ఈ ఘటన గోవా ఘటనకు ముందే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మార్చి వ తేదీన జరిగింది. అయితే, గోవా ఉదంతం నేపథ్యంలో పోలీసులు శనివారం నాడు ఈ విషయాన్ని తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఏప్రిల్ న అతనిని అరెస్టు చేశామని, జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+