ఫేస్ బుక్ ఫ్రెండ్: రేప్ చేసి స్మార్ట్ ఫోన్ లో రికార్డు
బెంగళూరు: ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువకుడు తనను నమ్మి వచ్చిన అమ్మాయి (16) మీద అత్యాచారం చేసి జైలుపాలైనాడు. బెంగళూరులో నివాసం ఉంటున్న డానియెల్ (24) అనే కామాంధుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలికకు ఆరు నెలల క్రితం డానియెల్ ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. సోమవారం సాయంత్రం బాలిక తన స్నేహితురాలి బర్త్ డే పార్టీకి వెళ్లింది.
అక్కడికి డానియెల్ వెళ్లాడు. తన స్నేహితురాలితో మాట్లాడాడు. నేను మీకు ఓ చిన్న పార్టీ ఇస్తున్నానని, నీవు తప్పకుండా రావాలని ఆమెకు చెప్పాడు. అమె మొదట పార్టీకి వెళ్లడానికి నిరాకరించింది.

ఎక్కువ బలవంతం చెయ్యడంతో చివరికి ఆమె అంగీకరించింది. పార్టీ మధ్యలోనే డానియెల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బర్త్ డే పార్టీ పూర్తి అయిన తరువాత డెనియెల్ స్నేహితుడు ఆ అమ్మాయిని బైక్ లో పిలుచుకుని వెళ్లాడు.
డానియెల్ ఇంటి దగ్గర అమ్మాయిని డ్రాప్ చేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అమ్మాయికి అనుమానం వచ్చింది. అప్పటికే మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ చేతపట్టుకున్న డెనియెల్ ఆమెతో బలవంతంగా తాగించాడు.
స్పృహ కోల్పోయిన ఆమె మీద అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తరువాత యువతి జరిగిన విషయం తెలుసుకుని షాక్ కు గురైయ్యింది. తాను రేప్ చేసే సమయంలో స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు.
తరువాత అమ్మాయిని తీసుకు వెళ్లి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. రాత్రి బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో డానియెల్ మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశామని, అతని దగ్గర ఉన్న వీడియో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications