భారత్‌లో జూకర్స్ బర్గ్, రేపు ప్రధాని మోడీతో భేటీ
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వ్యవస్దాపకుడు మార్క్ జూకర్స్‌బర్గ్ గురువారం భారత్‌కు వచ్చారు. న్యూఢిల్లీలో internet.org(అక్టోబర్ 9,10)వెబ్ సైట్‌ను ప్రారంభించిన అనంతరం జూకర్స్‌బర్గ్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతీ మానవుడికి హక్కు లాంటిదని అభివర్ణించాడు.
భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఫేస్‌బుక్ వినియోగం విస్తృతంగా ఉండటంతో పాటు రోజురోజుకీ వృద్ది చెందుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించుకునే సదుపాయం ప్రతి ఒక్కరికీ ఉండాలని అన్నారు. తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని రేపు తాను కలవనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

మార్కెట్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం ఫేస్‌బుక్ సంస్థ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ భారత్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో ఆమె కేంద్ర ఐటీ కమ్యూనికేషన్స్ మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు.

మైక్రోపాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అమెజాన్. కామ్ చీఫ్ జెఫ్ బెజోస్‌ల పర్యటన తర్వాత భారత్‌కు వస్తున్న జూకర్స్‌బర్గ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్. కామ్ సంస్దలు రెండూ, భారత్ లో తమ క్లౌండ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జూకర్స్ బర్గ్ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications