వాహ్ తాజ్! ఫేస్‌బుక్ టీమ్ సందడి (వీడియో)
ఆగ్రా: ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ను చూసి ఫేస్ బుక్ టీం సభ్యులు పులకించిపోయారు. ఇంతటి చక్కటి తాజ్ మహల్ భారతదేశంలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అని వారు చెప్పారు.
ఫేస్ బుక్ టీంలోని 30 మంది సభ్యులు అమెరికా నుంచి ఆగ్రా చేరుకున్నారు. ఫేస్ బుక్ భారత ప్రతినిధి కే. రెడ్డి ఆ టీంను తీసుకుని ఆగ్రా చేరుకున్నారు. అక్కడి అందచందాల గురించి రెడ్డి వారికి వివరించారు.

తాజ్ మహల్ నిర్మించడానికి గలకారణాలు వారికి చెప్పారు. ఇంతటి అద్బుతమైన తాజ్ మహల్ చరిత్రను వారు తెలుసుకున్నారు. సుమారు గంట పాటు అక్కడే ఉన్నారు. అందరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఫేస్ బుక్ టీంతో పలువురు పర్యాటకులు ఫోటోలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications