జాతీయ నిరుద్యోగ నిర్మూలనా పథకం ప్రారంభమైందా?: రేషన్ కార్డు ఉంటే రూ.50 వేలు? క్లారిటీ ఏంటీ?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. సోషల్ మీడియాలో నకిలీ కథనాలు, ఫేక్ న్యూస్ తీవ్రం అయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలకు 500 రూపాయల మొత్తాన్ని బదిలీ చేస్తోంది. ఇది నిజం. అదే సమయంలో- రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 50 వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి మరో కొత్త పథకాన్ని ప్రారంభించిందనే వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఆ పథకం పేరే రాష్ట్రీయ దక్షిత్ బేరోజ్‌గార్ యోజన. ఈ పథకం కింద పేదరికాన్ని నిర్మూలించడానికి తెలుపురంగు రేషన్ కార్డు ఉన్న కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి 50 వేల రూపాయలు జమ చేస్తోందనే వార్తలు కొద్దిరోజులుగా వెల్లువెత్తాయి. ప్రజల్లో ఆశాభావాలను రేకెత్తించాయి. సీనియర్ సిటిజన్లు, రైతులు, వితంతువులు, దినసరి వేతన కార్మికులు, నిరుద్యోగులకు కూడా ఈ పథకం కిందికి తీసుకొచ్చిందంటూ వెల్లువెత్తిన సమాచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

Fact Check: Not launched scheme which gives Rs 50,000 to ration card holders: Govt

అలాంటి పథకాన్ని ఏదీ తాము ప్రారంభించలేదని వెల్లడించింది. ఈ వార్త నిరాధారమైనదని స్పష్టం చేసింది. వాటిని ఎవరూ విశ్వసించ వద్దని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించింది. అలాంటి పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచన కూడా లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వస్తోన్న లింకులను తెరచి చూడొద్దని కేంద్రం హెచ్చరించింది. అందులో పొందుపరిచిన విధంగా ప్రజలు తమ వివరాలను వెల్లడించవద్దని సూచించింది.

Recommended Video

    Liquor: Check Out New Increased Price of Quarter Half And Full Bottles Liquor

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+