వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్ - షిండే : నేడే ప్రమాణ స్వీకారం - గవర్నర్ తో భేటీ..!!

|
Google Oneindia TeluguNews

అనూహ్య పరిణామాల తరువాత మాజీ సీఎం ఫడ్నవీస్ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో అధికార కూటమిలో చోటు చేుకున్న రాజకీయ సంక్షోభం..చివరకు సీఎం థాక్రే రాజీనామాకు దారి తీసింది. ఆ వెంటే గౌహతి నుంచి గోవా చేరుకున్న రెబల్ వర్గం నేత ఎక్ నాథ్ షిండే నేరుగా బీజేపీ నేత ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. ఇద్దరూ కొత్త ప్రభుత్వ ఏర్పాటు.. శివసేన రెబల్స్ కు మంత్రి పదవుల గురించి చర్చించారు. మరింత సమయం తీసుకోకుండా వెంటనే గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సాయంత్రం 7 గంటలకు సీఎంగా పఢ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

గవర్నర్ తో ఫడ్నవీస్ - షిండే భేటీ

గవర్నర్ తో ఫడ్నవీస్ - షిండే భేటీ

ప్రస్తుతం రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమైన ఫడ్నవీస్..షిండే అసెంబ్లీతో తమ సంఖ్యా బలం గురించి వివరిస్తున్నట్లుగా సమాచారం. అసెంబ్లీలో ఇప్పుడు అతి పెద్ద సంఖ్యా బలం ఉన్న పార్టీగా బీజేపీకి 106 మంది సభ్యుల మద్దతు ఉంది. షిండే వర్గంలో 49 మంది ఉన్నట్లుగా ఆయన సభ్యుల మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు వచ్చారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావాల్సిన మెజార్టీ తమకు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం తీసుకుంటే..వెంటనే ఈ సాయంత్రం సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు షిండేకు మద్దతుగా ఉన్నారు.

ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం

ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం

ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఎక్కువ తీసుకుంటే ఇతర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందనే ఆలోచనతో ముందడుగు వేయాలని నిర్ణయించారు. ముందుగా రేపు (జూలై 1)న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. కానీ, సమయం మరింతగా పొడిగించ కుండా ముందుగా ముఖ్యమంత్రి - డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకున్న తరువాత పూర్తి స్థాయి కేబినెట్ విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా షిండే వర్గానికి ఎన్ని మంత్రి పదవులు - ఏ శాఖలు అనే అంశం పైన ఫడ్నవీస్ తో చర్చలు పూర్తయ్యాయి. ఇరువురూ ఒక అంగీకారానికి వచ్చారు.

శాసనసభలోనూ బల నిరూపణ

శాసనసభలోనూ బల నిరూపణ


మద్దతుగా నిలిచిన స్వతంత్ర సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సాయంత్రం ప్రమాణ స్వీకారం తరువాత శనివారం అసెంబ్లీలో బల పరీక్ష జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీని పైన గవర్నర్ అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం . .బల నిరూపణ చేసుకోవటం పైనే బీజేపీ నేతలు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ద్వారా.. మహారాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా ముగిసినట్లుగా భావించాల్సి ఉంటుంది.

English summary
Devendra Fadnavis and Shiv Sena rebel leader Eknath swear as CM and Dy CM to day at Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X