ఎస్‌బీఐ ఏటీఎం షాక్: డ్రా చేస్తే పిల్లలు ఆడుకునే రూ. 2000నోట్లు వచ్చాయ్!

దేశ రాజధానిలోని ఓ ఏటీఎం నుంచి వచ్చిన నోట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సదరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పిల్ల‌లు ఆడుకొనే న‌కిలీ 2000 నోట్లు రావ‌డం ఇప్పుడు సంచలనంగా మారింది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ ఏటీఎం నుంచి వచ్చిన నోట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సదరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పిల్ల‌లు ఆడుకొనే న‌కిలీ 2000 నోట్లు రావ‌డం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ద‌క్షిణ ఢిల్లీలోని సంగ‌మ్ విహార్‌లో ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఈ నోట్లు వ‌చ్చాయి.

మొద‌ట చూడ‌గానే ఇవి అస‌లు నోట్లుగానే క‌నిపించినా.. ఈ నోటుపై ఆర్బీఐకి బ‌దులుగా చిల్డ్ర‌ెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్ర‌న్స్ గ‌వ‌ర్న్‌మెంట్ అని ఉండ‌టం గమనార్హం. చూర‌న్ లేబుల్ అని ఓ ప‌క్క రాసి ఉంది. బ్యాంకు సీల్‌కు బ‌దులుగా పీకే లోగో ఉంది.

Fake Rs 2000 notes of ‘Children Bank of India’ dispensed from SBI ATM in Delhi

మొద‌ట ఓ క‌స్ట‌మ‌ర్‌కు ఇలాంటి నాలుగు నోట్లు వ‌చ్చాయ‌ని ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారి వెల్ల‌డించారు. దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌డానికి ఓ ఎస్ఐని పంపించామ‌ని, అత‌ను కూడా విత్‌డ్రా చేయ‌గా.. అలాంటిదే మ‌రో నోటు వ‌చ్చింద‌ని ఆ అధికారి తెలిపారు. ఏటీఎంలో ఉన్న మిగ‌తా నోట్ల‌ను ప‌రిశీలించ‌గా.. అవ‌న్నీ అస‌లువే ఉన్నాయ‌ని చెప్పారు.

ద‌క్షిణ ఢిల్లీలోని చ‌త్తార్‌పూర్‌ కాల్‌సెంట‌ర్లో ప‌నిచేసే రోహిత్ అనే వ్య‌క్తికి మొద‌ట‌గా ఈ న‌కిలీ నోట్లు వ‌చ్చాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ న‌కిలీ నోట్లు ఎవ‌రు ఉంచార‌న్న‌దానిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు. అటు ఎస్‌బీఐ బృందం కూడా ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేపట్టింది. నోట్లు ఏటీఎంలో పెట్టే సమయంలోనే ఈ నోట్లను కూడా అసలు నోట్లతో కలిపి పెట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+