నకిలీ స్టాంపుల కుంభకోణంలో పాత్రధారి కరీం తెల్గీ మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: నకిలీ స్టాంపుల కుంభకోణంలో నిందితుడు కరీం లాలా తెల్గీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో శుక్రవారం నాడు మరణించాడు.

2001లో నకీలీ స్టాంపుల కుంభకోణంలో కరీం తెల్గీ అరెస్టయ్యారు.

Fake stamp paper scam convict Abdul Karim Telgi dies in Bengaluru hospital

56 ఏళ్ళ కరీం తెల్గీ విక్టోరియా ఆసుపత్రిలో పది ఆసుపత్రిలో చేరారు.పదిరోజులుగా తెల్గీ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకొన్నారు. అయితే చికిత్స పొందుతూ తెల్గీ మరణించారు

2006 సంవత్సరంలో తెల్గీకి 30 ఏళ్ళ జైలు శిక్షను విధించారు. కరీం తెల్గీకి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంతో సంబంధాలున్నాయి. అప్పటి టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కృష్ణయాదవ్‌ పై . నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతోనే కృష్ణయాదవ్ అరెస్టయ్యారు.

ఈ కేసు కారణంగానే కృష్ణయాదవ్‌ను మంత్రివర్గం నుండి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పించారు.

ఈ ఆరోపణలను అప్పట్లోనే కృష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. తనను ఈ కేసులో ఇరికించారని ఆయన ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fake stamp paper scam convict Abdul Karim Telgi dies in Bengaluru hospital

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి