దళిత వరులు గుర్రపు స్వారీ చేశారని బహిష్కరించారు

Families of 2 dalit grooms ostracized for riding horse as marriage ritual
జైపూర్: ఓ వైపు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ.. ఇంకా అంటరానితనం లాంటి సామాజిక రుగ్మతలు పూర్తిగా అంతం కావడం లేదు. ఇందుకు ఉదాహరణగా రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలోని థబోలాలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. వివాహం సందర్భంగా గుర్రపు స్వారీ చేశారనే నెపంతో ఇద్దరు వరులపై దాడి చేయడమే కాకుండా వారికి సంబంధించిన రెండు కుటుంబాలను వెలివేశారు. ఈ ఘటనపై మండల పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరం.

దీంతో ఈ విషయాన్ని రాజస్థాన్ దళిత్ సందర్భ్ కేంద్ర(దళిత్ అధికార్ నెట్‌వర్క్), ఓ స్వచ్ఛంద సంస్థ ఉన్నతాధికాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దళితులకు భద్రత, హక్కులను కల్పించాలని కోరాయి. థబోల గ్రామంలో నివాసం ఉంటున్న కైలాష్ బలాయి(21), నర్యన్ బలాయి(22)లకు మే 8న వివాహం జరిగింది. అయితే వివాహం సందర్భంగా వరులు గుర్రపు స్వారీ చేయకూడదని గ్రామంలోని అగ్రకులాలకు చెందిన పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.

మే 6న వివాహానికి ముందు జరిగే కార్యక్రమంలో వరులు కైలాష్ బలాయి, నర్యన్ బలాయిలు గుర్రపు స్వారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీసులు భద్రత కల్పించారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన వెంటనే అక్కడికి వచ్చిన అగ్రకుల పెద్దలు వారిని గుర్రాల పైనుంచి తోసేశారు. ఆ తర్వాత వారిని తీవ్రంగా దూషించారు. అంతేగాక మే 8న వివాహం జరిగిన నాటి నుంచి తమకు ఎలాంటి సేవలు, సహాయం గానీ ఇతర గ్రామస్తుల నుంచి అందకుండా చేశారని వరుడు కైలాష్ బలాయి తెలిపాడు. తమను రిక్షా గానీ, వాహనాలను ఎక్కనివ్వలేదని, ఆహార ధాన్యాలు అందించేందుకు నిరాకరించారని చెప్పాడు.

తమ గ్రామంతోపాటు ఇతర గ్రామాల నుంచి కూడా తమకు సహాయం అందలేదని తెలిపాడు. బాధిత రెండు కుటుంబాలు మొత్తం 18మందిపై మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఫిర్యాదు వెనక్కి తీసుకోకుండా తీవ్ర పరిణామాలుంటాయని అగ్రకుల పెద్దలు బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇది ఇలా ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+