Family: జ్యూస్ లో విషం కలిపి భార్య, పిల్లలకు ఇచ్చి వ్యాపారి ఏం చేశాడంటే ?, వాట్సాప్ లో లెటర్ !
చెన్నై/ కడలూరు: అప్పులు సరైన సమయంలో వసూలు కాకపోవడంతో ఓ వ్యక్తి వ్యాపారం చెయ్యడానికి అతను ఇంకా బయట ఎక్కువగా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఆ వ్యాపారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంతకాలం అప్పులు తీసుకున్న వారితో విసిగిపోయిన వ్యాపారి ఈజీవితం వద్దు అనుకున్నాడు. గ్రేప్ జ్యూస్ లో విషం కలిపి తీసుకెళ్లి భార్య, పిల్లలకు ఇచ్చాడు. తరువాత ఉరి బయటకు వెళ్లి మా జీవితాలు నాశనం కావడానికి ఎవరెవరు కారణం అంటూ స్నేహితుడికి వాట్సాప్ లో మొత్తం మ్యాటర్ పంపించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యాపారి హ్యాపీలైఫ్
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం సమీపంలోని వందాయంపల్లంలో గణేష్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గణేష్ కల్పనా (34) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గణేష్, కల్పనా దంపతులకు సంగమిత్ర (11) అనే కుమార్తె, గురుచరణ్ (9) అనే కుమారుడు ఉన్నాడు.

ఎరువుల హోల్ సేల్ షాప్
చిదంబరం బైసాప్ రోడ్డులోని పోయ్యపిల్లివాడిలో గణేష్ సొంతంగా ఎరువులు. పురుగుల మందు దుకాణం నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న గణేష్ ఇంతకాలం అతని భార్య కల్పనా, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాడు. వ్యాపారం చెయ్యడానికి గణేష్ బయట అప్పులు తీసుకుని అతను రైతులకు అప్పులు ఇచ్చాడు.

వ్యాపారికి నానా ఇబ్బందులు
ఇచ్చిన అప్పులు సరైన సమయంలో వసూలు కాకపోవడంతో వ్యాపారం చెయ్యడానికి గణేష్ బయట ఇంకా ఎక్కువగా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు వ్యాపారి గణేష్ ను డబ్బులు తిరిగి ఇవ్వాలని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంతకాలం అప్పులు తీసుకున్న వారితో విసిగిపోయిన వ్యాపారి గణేష్ ఈజీవితం వద్దు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

గ్రేప్ జ్యూస్ లో విషం కలిపి భార్య, పిల్లలకు ఇచ్చాడు
గ్రేప్ జ్యూస్ లో విషం కలిపిన గణేష్ ఆ జ్యూస్ తీసుకెళ్లి భార్య కల్పనాతో పాటు అతని పిల్లలకు ఇచ్చాడు. జ్యూస్ తాగిన కల్పనా, ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకోవడంతో అది చూడలేక గణేష్ ఊరిబయటకు వెళ్లిపోయాడు. నా భార్య, పిల్లలు విషం తాగేశారు, దయచేసి వారిని కాపాడండి అంటూ స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్ చేశాడు.

వాట్సాప్ లో డెత్ నోట్
తరువాత మా జీవితాలు నాశనం కావడానికి అప్పులు తీసుకున్న వాళ్లు అప్పులు ఇచ్చిన వారు కారణం, వాళ్ల కారణంగా మా జీవితాలు నాశనం అయ్యాయి, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని గణేష్ అతని స్నేహితుడికి వాట్సాప్ లో డెత్ నోట్ పంపించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

డెత్ నోట్ లో పూర్తి మ్యాటర్
గణేష్ స్నేహితులు అతని భార్య కల్పనా, పిలల్లను కడలూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డెత్ నోట్ ఆధారంగా పోలీసులు పలువురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications