వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసేమియాతో తల్లడిల్లుతున్న వినిశ్రీ చికిత్సకు సాయం కోసం తల్లి ఎదురుచూపు

Google Oneindia TeluguNews

రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్యే మాకు శరణ్యం అనుకున్నాం. ప్రతిరోజూ మా కుమార్తె చికిత్సకు అవసరమైన సొమ్ము చేతికి అందక ఇబ్బందులుపడేవాళ్లం. నిరాశలో కూరుకుని ఉన్న మాకు ఆత్మహత్యే ఉత్తమమైన మార్గం అనిపించింది. నా కూతురు అడిగేది. ఎందుకమ్మా, అందరినీ అలా డబ్బులు అడుగుతావు. అలా అడగడం మంచిది కాదని. కానీ, కనీసం తన ప్రాణాన్ని కూడా నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో మేమున్నామని ఎలా తెలిపేది? డబ్బును సమకూర్చే ప్రక్రియలో, మా హృదయం ఛిన్నా భిన్నమవుతుందని తనకు ఎలా చెప్పగలం? కళ్ళకు కనిపించే నవ్వు వెనక, కనపడని బాధలను దిగమింగుకుని బిడ్డ పంచన ఉంటున్నాము. ఆ బాధ తనకు తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్నామంటూ ఆరేళ్ల వినిశ్రీ తల్లి ముత్తువల్లి ఆవేదన చెందింది.

నా కుమార్తె తలసేమియా సమస్యతో బాధపడుతోంది. ఎముక మజ్జ మార్పిడి చికిత్స తప్పనిసరి. అందుకు సుమారుగా 9,40,000 రూపాయలు (USD 14,462) అత్యవసరంగా జమ చేయాలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో ఉండే మేము, కళ్ల ముందు మా పాప అల్లాడిపోతున్నా చూస్తూ ఉండాల్సిన దీన స్థితిలో ఉన్నాం.

Family of fisherman can’t afford expensive bone marrow transplant for daughter

అనారోగ్యకర స్థితిలో ఉన్న కుమార్తెని చూస్తూ కన్నీళ్ళతో కాలం గడుపుతున్న నిస్సహాయ తల్లిగా మీ ముందు నిలబడ్డాను. నా పేరు ముత్తువల్లి. నాకు ఆరేళ్ల కూతురు ఉంది. పేరు వినిశ్రీ. ఆమె పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేది. పాప జన్మించిన మూడు నెలల తర్వాత ఆమె తలాసేమియా సమస్యతో ప్రధానంగా బాధపడుతుందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమెకు శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తీవ్రమయ్యాయి.

అందువల్ల దగ్గరలో కరైకాల్లో ఉన్న స్థానిక వైద్యుడికి చూపిస్తూ వచ్చాం. ఆ తర్వాత క్రమంగా కారైకాల్ నుంచి పాండిచ్చేరికి, చెన్నైతో కలిపి మూడు, అంతకన్నా ఎక్కువ ఆసుపత్రుల్లో చూపించాం. పాప మూడు నెలల వయస్సు నుంచి ఈరోజు వరకు, తరచుగా రక్తమార్పిడి కోసం ప్రతి నెలలో కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని విహెచ్ఎస్ ఆసుపత్రిలో పాపకు రక్త మార్పిడి చేయిస్తున్నాం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.

Family of fisherman can’t afford expensive bone marrow transplant for daughter

నా భర్త అంబజలాగన్ మత్స్యకారుడు. ఆయన కుటుంబానికి ఏకైన ఆదరువు. నెలసరి ఆదాయం సుమారు రూ .4,000 (USD 62)వరకు ఉంటుంది. ఏరకమైన ఇతర ఆదాయాలు లేవు. మా కుమార్తె చికిత్స కోసం విక్రయించటానికి మావద్ద ఎటువంటి ఆస్థిపాస్తులూ లేవు. ప్రభుత్వ పాఠశాలలో వినిశ్రీ 1వ క్లాసు చదువుతుంది. మా పాపకు చేసే చికిత్సకు అవసరమయ్యే 9,40,000రూపాయల (14,462డాలర్లు) డబ్బును ఏర్పాటు చేయగల స్థోమత మాకు లేదు. చికిత్సను ప్రారంభించడానికి వీలైనంత త్వరగా చెల్లించమని ఆసుపత్రి యాజమాన్యం మమ్మల్ని కోరింది. మాకు మీ సహాయం నిజంగా అవసరం... కనికరించండి

పిల్లలు దేశ భవిష్యత్తు అంటారు. వారి ద్వారా మాత్రమే మనము భావితరాలకు నూతన సమాజాన్ని నిర్మించగలము. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, మరి వినిశ్రీ మినహాయింపు కాదు కదా. ఆమె కూడా అందరిలా స్వేచ్చగా జీవించాలి. మీ వైపు నుంచి చేసే ఏ చిన్న సహకారమైనా ఈ పసిబిడ్డను కాపాడడంలో సహాయపడుతుంది. వినిశ్రీని రక్షించడానికి చేతులు కలపండి. ఒక ప్రాణాన్ని నిలబెట్టండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X