Family: తాత ఆస్తి కోసం ఢిష్యూం డిష్యూం, క్లైమాక్స్ లో శాడిస్టు ఏం చేశాడంటే ?
చెన్నై/తిరువూర్: వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూతుర్లు, కొడుకు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. వయసు మీదపడిన ఆయన కొడుకు ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. మనుమడు అతని తాత మీద కిరోసిన్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. ఇంత చేసినా మనుమడికి ఆస్తి దక్కుతుందా అంటే లేదు.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని గుడవాసల్ సర్కిల్ సమీపంలోని ఎరవేందచ్చేరి ప్రాంతంలో రేణుయ్యన్ (72) ఆనే ఆయన నివాసం ఉంటున్నాడు. రేణుయ్యన్ కుమారుడు లక్ష్మణన్ ఆటవి శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మణన్ కు అఖిలన్ (22) అనే కుమారుడు ఉన్నాడు. అఖిలన్ కాలేజ్ చదువు మద్యలో నిలిపేశాడు.

కాలేజ్ చదువు మద్యలో నిలిపేసిన అఖిలన్ స్నేహితులతో జులాయిగా తిరుగుతూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ఆస్తిలో వాటా పెట్టాలని తాత రేణుయ్యన్ తో అఖిలన్ గొడవ పడుతున్నాడు. ఇదే విషయంలో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు రాజీలు చేస్తూ ఇంతకాలం రాజీ చేస్తూ వస్తున్నారు.
ఇంటిలో గొడవలు భరించలేక రేణుకయ్యన్ ఇంటి సమీపంలోని గుడిలో నిద్రపోతున్నాడు. తాత ఎంతకాలానికి ఆస్తిలో భాగం పెట్టడం లేదని అఖిలన్ రగిలిపోయాడు. రాత్రి నిద్రపోతున్న తాత రాణేకయ్యన్ మీద కిరోసిన్ పోసిన అఖిలన్ నిప్పంటించాడు. ఆస్తి కోసం సొంత మనుమడు తాత మీద కిరోసిన్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications