Family: మద్యం మత్తులో భార్యను చితకబాదేశాడు, అడ్డుపడిన తల్లిని సజీవదహనం చేసి, విషం తాగేసి !
వారణాసి/ ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. భర్త తల్లి కూడా కొడుకు, కోడలుతో కలిసి ఉంటున్నది. భార్య, భర్త, వాళ్ల పిల్లలు కలిసి ఓ రూమ్ లో ఉంటున్నారు. తల్లి మరో రూమ్ లో ఉంటున్నది. తల్లి ఉంటున్న రూమ్ తనకు కావాలని కొడుకు కొంతకాలం నుంచి చెబుతున్నాడు. నువ్వు వేరే రూమ్ లో ఉంటే నేను, నా భార్య, పిల్లలు ఆ రూమ్ లో ఉంటామని కొడుకు అతని తల్లికి చెప్పాడు. కొన్ని రోజులు ఈ రూమ్ లో ఉంటానని, తరువాత రూమ్ ఇచ్చేస్తానని తల్లి చెప్పడంతో కొడుకు సైలెంట్ అయిపోయాడు. అయితే రూమ్ విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.
మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యకు విషం కలిపిన ఆహారం తినిపించడానికి ప్రయత్నించాడు. ఆహారంలో విషం కలిపారని తెలుసుకున్న భార్య ఆ ఆహారం తినడానికి నిరాకరించింది. ఆ సమయంలో భార్యను చితకబాదేశాడు. కొడుకును అడ్డుకోవడానికి తల్లి ప్రయత్నించింది. ఆ సమయంలో రెచ్చిపోయి కొడుకు తల్లి మీద పెట్రోల్ పోసి నిప్పింటించాడు. తల్లికి నిప్పంటించిన తరువాత కొడుకు కూడా విషం తాగేశాడు.

భార్య, బిడ్డలు, తల్లితో కలిసి ఉంటున్నాడు
ఉత్తరప్రదేశ్ లోని భాదోహి జిల్లాలోని ఔరాయ్ సమీపంలోని ముక్తార్ గ్రామంలో మహాజన్ సోంకర్ అలియాస్ మహాజన్ (35) అనే వ్యక్తి అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మహాజన్ తల్లి రాజ్ కుమారి (60) కూడా కొడుకు, కోడులు, వాళ్ల పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.

రూమ్ కోసం ఇంట్లో గొడవలు
మహాజన్, అతని భార్య పిల్లలు కలిసి ఓ రూమ్ లో ఉంటున్నారు. మహాజన్ తల్లి రాజకుమారి మరో రూమ్ లో ఉంటున్నది. తల్లి రాజకుమారి ఉంటున్న రూమ్ తనకు కావాలని ఆమెకు కొడుకు మహాజన్ కొంతకాలం నుంచి చెబుతున్నాడు. నువ్వు వేరే రూమ్ లో ఉంటే నేను, నా భార్య, పిల్లలు ఆ రూమ్ లో ఉంటామని మహాజన్ అతని తల్లి రాజకుమారికి చెప్పాడు.

తల్లి మీద కోపంతో భార్యను చితకబాదేశాడు
కొన్ని రోజులు ఈ రూమ్ లో ఉంటానని, తరువాత రూమ్ ఇచ్చేస్తానని మహాజన్ కు అతని తల్లి రాజకుమారి చెప్పడంతో కొడుకు సైలెంట్ అయిపోయాడు. అయితే రూమ్ విషయంలో మహాజన్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మద్యం సేవించి ఇంటికి వెలుతున్న మహాజన్ తల్లి రాజకుమారి మీద కోపంతో అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు.

తల్లిని చంపేశాడు..... ఆసుపత్రిలో ?
రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మహాజన్ అతని భార్యకు విషం కలిపిన ఆహారం తినిపించడానికి ప్రయత్నించాడు. ఆహారంలో విషం కలిపారని తెలుసుకున్న మహాజన్ భార్య ఆ ఆహారం తినడానికి నిరాకరించింది. ఆ సమయంలో మహాజన్ భార్యను చితకబాదేశాడు. కొడుకును అడ్డుకోవడానికి రాజకుమారి ప్రయత్నించింది. ఆ సమయంలో రెచ్చిపోయి మహాజన్ తల్లి రాజకుమారి మీద పెట్రోల్ పోసి నిప్పింటించాడు. తల్లికి నిప్పంటించిన తరువాత మహాజన్ విషం తాగేశాడు. ఆసుపత్రిలో చికిత్స విఫలమై రాజకుమారి చనిపోయింది. మహాజన్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications