లవర్స్ ఎఫెక్ట్, కమలాపురంలో క్యాస్ట్ ఫీలింగ్, అమ్మాయి ఫ్యామిలీ ఏం చేసిందంటే ?

కొన్ని రోజుల క్రితం బెళగావిలోని కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అమానవీయ ఘటన ఏంటో తెలుసా? కొడుకు అమ్మాయితో పారిపోయాడన్న కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి తల్లికి పూర్తిగా బట్టలు విప్పి ఆమెను నగ్నంగా స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ ఘటనతో ఒక్క కర్ణాటక రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. కర్ణాటక హైకోర్టు సుమోటు కేసు నమోదు చేసింది.

ఈ ఘటనపై కోర్టులో విచారణ జరుగుతుండగానే మళ్లీ అలాంటి అమానవీయ ఘటనలు వెలుగు చూసింది. కర్ణాటకలోని దావణగెరెలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమించిన కొడుకు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అయితే యువకుడి తల్లిదండ్రులపై యువతి కుటుంబ సభ్యులు, బంధులువులు కలిసి దాడికి పాల్పడ్డారు. యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Family members of the girl who attacked her boyfriends parents naked in Karnataka

యువకుడి తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేసి వారిని చితకబాదేశారు. దావణగెరె జిల్లా హరిహర్ తాలూకా కమలాపూర్‌లో చోటుచేసుకుంది. కమలాపూర్‌లో సిద్ధార్థ, సృష్టి అనే ప్రేమ జంట నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ 20 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఒక దేవాలయంలో వివాహం చేసుకున్న తరువాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి పెళ్లిని అధికారికంగా నమోదు చేసుకున్నారు.

అందరూ న్యూఇయర్ వేడుకలు చేసుకోవడానికి సిద్దం అయిన సందర్బంలో ఆదివారం సాయంత్రం యువకుడు సిద్దార్థ తండ్రి అరుండి బసప్ప అలియాస్ బసప్ప మీద అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి పాల్పడ్డారు. అమ్మాయి వేరే కులం అనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. అమ్మాయి అగ్రకులానికి చెందినది కావడంతో వీళ్ల పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

అయితే ప్రేమికుల పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులే కారణమంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ల మీద దాడి చేశారు. సిద్దార్థ తండ్రి బసప్ప, అతని భార్య మల్లమ్మపై దారుణంగా దాడి చేశారు. యువకుడి తండ్రి బసప్పను వివస్త్రను చేసి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బసప్పతో పాటు ఆయన భార్యను కూడా వివస్త్రను చేసి దాడి చేశారు. దాడికి గురైన బసప్ప ప్రస్తుతం దావణగెరెలోని చిగటేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైంది. మలేబెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+