రాహుల్ గాంధీ ప్రచారంలో ఓ యువ‌తి సాహసం.. ఏం చేసిందంటే.. (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రాహుల్ తో సెల్ఫీ దిగేందుకు ఓ యువతి ఏకంగా సాహసమే చేసింది. అసలేం జరిగిందంటే...

రాహుల్ గాంధీ 'బ్లాక్ బెల్ట్': ఐకిడో స్టిల్స్ అదుర్స్(పిక్చర్స్)

గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. అధికార, విప‌క్ష పార్టీల నేత‌లు పోటాపోటీ ప్ర‌చారంలో మునిగిపోయాయి. ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఆయా ప్రాంతాల్లో జోరుగా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

బుధవారం గుజరాత్ లోని బరూచ్ లో రాహుల్ గాంధీ ప్రచారానికి వెళ్లారు. బీజేపీ నేత‌ల‌పై పంచ్‌లు వేస్తూ త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇంతలో అనూహ్య సంఘటన జరిగింది.

ఆయ‌న వాహ‌నంపై ఉండగా ఓ యువ‌తి అంద‌రూ చూస్తుండ‌గానే వాహ‌నంపైకి ఎక్కేసింది. రాహుల్ గాంధీ కూడా ఆమెను ఏమీ అన‌లేదు. వాహ‌నంపైకి ఎక్కిన‌ ఆమె రాహుల్ గాంధీ భుజంపై చేయి వేసింది.

ఆ త‌రువాత తన స్మార్ట్‌ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగింది. అనంత‌రం రాహుల్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి దిగిపోయింది. ఆ అమ్మాయి చేసిన సాహసానికి అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు. మరి మీరూ చూడండి...

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl in Bharuch made her way to reach Rahul Gandhi's van which earned her a selfie with the Congress vice president. Congress Vice President Rahul Gandhi was on a road show in Bharuch, Gujarat, when the selfie-incident happened and it was all caught on camera. The Bharuch girl was nifty with her movements as she climbed on top of Rahul Gandhi's van to click a selfie with him. A bouquet of flowers soon landed in her hands as the security personnel helped the girl with her endeavours to have a photo with Rahul Gandhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి