వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సాయం కావాలి, శశికళకు చెక్ చెప్పాలంటే రావాలి': రజనీకాంత్‌కు పిలుపు

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, మంచి రాజకీయాలు కోరుకుంటున్న వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, మంచి రాజకీయాలు కోరుకుంటున్న వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

తమిళనాట రజనీకాంత్ అలజడి!: మోడీ మద్దతు, కొత్త పార్టీ వస్తుందా?తమిళనాట రజనీకాంత్ అలజడి!: మోడీ మద్దతు, కొత్త పార్టీ వస్తుందా?

మరోవైపు, భారతీయ జనతా పార్టీ కూడ ఆయన ద్వారా ఆయన ద్వారా తమిళనాట పాగా వేయాలని భావిస్తోంది. 2014లోనే ఆయన మద్దతు కోసం ప్రయత్నించి, విఫలమైంది. ఇప్పుడు మరోసారి ఆయన కోసం పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Fans want superstar Rajinikanth to join politics to ‘save’ TN from Sasikala

జయలలిత మృతి అనంతరం శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఆమె ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండింది. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్‌కు అభిమానులు, ఇతరులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటున్నారు. జయలలిత మృతి అనంతరం తమిళనాట మంచి రాజకీయం కోసం సూపర్ స్టార్ రంగంలోకి దిగాలంటున్నారు.

'పవర్' గురించి మాట్లాడిన రజనీకాంత్, కానీ'పవర్' గురించి మాట్లాడిన రజనీకాంత్, కానీ

ముఖ్యమంత్రి కావాలనకుున్న శశికళకు, ఆమె వ్యూహాలకు చెక్ చెప్పగల హీరో రజనీకాంత్ అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. శశికళ వంటి వారు సీఎం కావొద్దంటున్నారు. 'సూపర్ స్టార్ తలైవా మీరు రావాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు సాయం చేయాలి. శశికళ సీఎం కావొద్దు' అని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

English summary
In the wake of AIADMK general secretary VK Sasikala becoming the next CM of Tamil Nadu, many want Rajinikanth to join politics to avoid the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X