వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.15 లక్షలు జమ.. పథకం అనుకొని ఇల్లు కట్టగా.. బ్యాంక్ నుంచి నోటీసు..

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పు విచిత్రాలు జరుగుతుంటాయి. అవును ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా.. అయితే గుర్తించేలోపే జరగాల్సిన పని జరిగిపోతుంది. ఇలాంటి ఘటన మహారాష్ట్రలో కూడా జరిగింది. ఓ రైతు ఖాతాలో రూ.15 లక్షల నగదు డిపాజిట్ అయ్యింది. అయితే అదీ జన్ ధన్ నగదు అని.. రైతు ఎంచక్కా ఇల్లు కట్టేశాడు. తర్వాత బ్యాంకు అధికారులు నోటీసు పంపించడంతో విస్తుపోయాడు. ఇదేంటని నోరెళ్లబెట్టాడు. విషయం తెలిసి నెత్తి బోరు బాదుకుంటున్నాడు. అయితే అందులో మెజార్టీ నగదును ఆయన ఖర్చుచేయడంతో ఏం చేయాలో తెలియడం లేదు.

మహారాష్ట్ర ఔరంగబాద్ జిల్లా ఫైతాన్ తాలుకాకు చెందిన జ్ఞానేశ్వర్ ఓతే రైతు ఖాతాలో నగదు పడింది. గతేడాది ఆగస్టులో రూ.15 లక్షల నగదు అతని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలో జమ అయ్యింది. విషయం తెలిసిన ఆయన జన్ ధన్ కింద నగదు వచ్చిందెమో అనుకున్నాడు. సరే తనకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసిందని అనుకున్నారు. ఇంకేముంది తన చిరకాల వాంఛ అయిన ఇల్లు కట్టడం ప్రారంభించారు. కానీ తర్వాతే అసలు సమస్య ప్రారంభం అయ్యింది.

farmer gets Rs 15 lakh in Jan Dhan account, builds house

బ్యాంకులో డిపాజిట్ అయిన నగదును తీశారు. అలా రూ.9 లక్షలు ఖర్చు చేశాడు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశాడు. థాంక్స్ చెప్పి.. సంబరపడిపోయాడు. కానీ తర్వాత తెలిసింది.. ఆ నగదు పొరపాటున వచ్చిందని.. వెంటనే బ్యాంకు అధికారులు నోటీసు పంపించారు. పొరపాటున నగదు జమ అయ్యిందని తిరిగి ఇచ్చేయాలని దాని సారాంశం. దీంతో ఆ రైతు ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యాడు. ఇదేంటి అని ఆశ్చర్య పోయాడు.

ఆ నోటీసు చూసిన రైతు నోరెళ్లబెట్టాడు. ఇదేందిరా భగవంతుడా అనుకున్నాడు. అయితే అందులో గల రూ.9 లక్షలను తన ఇంటి నిర్మాణం కోసం వాడేశారు. మిగతా రూ.6 లక్షల నగదును మాత్రం బ్యాంకు తిరిగి తీసుకున్నారు. మిగతా నగదు మాత్రం చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో అతను ఏం చేయాలో తెలియడం లేదు. ఇదేం కష్టం అని నెత్తిన చేయి వేసుకున్నాడు.

English summary
farmer Gyaneshwar Ote was delighted to find that Rs 15 lakh had - out of the blue - been deposited in his Jan Dhan bank account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X