కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతు నేతలు: రేపట్నుంచి ఢిల్లీకి మార్చ్

న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. పంటకు కనీస మద్దతు ధర కోరుతూ ఢిల్లీ చలో చేపట్టిన రైతు నేతలు కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ మీడియాకు వెల్లడించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు తమతో చర్చించిన విషయాలకు.. మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.

తమతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారని.. పప్పు దినుసులపై ఎంఎస్పీ కోసం రూ. 1.5 లక్షల కోట్ల వరకు ఖర్చు ఖర్చు చేస్తున్నట్లు మంత్రులు తమతో చెప్పారని తెలిపారు. కానీ, రూ. 1.75 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారన్నారు. అందువల్లే కేంద్రం ప్రతిపాదనను తాము తిరస్కరిస్తున్నామన్నారు జగ్జీత్. ఫిబ్రవరి 21న ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు రైతులను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు .

 Farmer union leaders Reject Centres Proposal; Delhi March From Wednesday

కాగా, ఆదివారం రాత్రి కూడా రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వారి ముందు కీలక ప్రతిపాదనలు ముందుంచారు. ఇందులో భాగంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర(MSP)కి కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ప్రతిపాదించింది.

ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్ని రైతు సంఘాలతో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదననను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు నేతలు ప్రకటించారు.

కాగా, ఇప్పటి వరకు రైతు సంఘాలతో కేంద్రం నాలుగు దఫాలుగా చర్చలు జరపడం గమనార్హం. తాజా భేటీకి ముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కందులు, మినుములు, మసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీపీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే పరిణామంపై ఎటువంటి పరిమితి ఉండదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+