Farmers: రైతులకు హాలీవుడ్ నటి మద్దతు, సీఎన్ఎన్ దెబ్బ, 1. 50 లక్షల మంది, వైరల్, పనిపాటలేదా? !
న్యూఢిల్లీ/ బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు రిపబ్లిక్ డే రోజు దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కొందరు చితకబాదేశారు. ఇలాంటి సందర్బంలో హాలీవుడ్ నటి, హాలీవుడ్ ఫేమస్ పాప్ సింగర్ రిహన్నా నావ్యాకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు, పాప్ సింగర్ రిహన్నా ట్వీట్ కు ఇప్పటి వరకు సుమారు 1 లక్షా 50 వేల మందికి పైగా రీట్విట్ లు చెయ్యడం తీవ్ర చర్చకు దారితీసింది. రైతులకు రిహన్నా మద్దతు ప్రకటించారని సీఎన్ఎన్ న్యూస్ వార్తలు ప్రసారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
Marriage: సముద్రం మధ్యలో పెళ్లి, 60 అడుగుల లోతులో ఎలా జరిగిదంటే, సూపర్ మామ, వైరల్ వీడియో !

హాలీవుడ్ నటి, టాప్ పాప్ స్టార్
రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలు మొత్తం రద్దు చెయ్యాలని కొంతకాలంగా అన్నదాతలు ఢిల్లీలో శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నటి, హాలీవుడ్ ఫేమస్ పాప్ స్టార్ రిహన్నా నావ్యాకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు,
హాట్ టాపిక్ అయిన సీఎన్ఎన్ న్యూస్
భారతదేశంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలకు హాలీవుడ్ నటి రిహన్నా సంపూర్ణ మద్దతు ప్రకటించారని అంతర్జాతీయ మీడియా సీఎన్ఎన్ వార్తలు ప్రసారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మొట్టమొదటి హాలీవుడ్ నటి రిహన్నా కావడం విశేషం.

రిహన్నాపై ఫైర్
భారతదేశంలోని రైతుల ఆందోళనకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, ప్రతిఒక్కరు అక్కడి అన్నదాతలకు మద్దతు ప్రకటించాలని పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ చేశారు. రిహన్నా ట్వీట్ కు సుమారు 1 లక్షా 50 వేల మందికిపైగా రీ ట్వీట్ లు చేశారు. కొందరు రిహన్నాకు మద్దతుగా ట్వీట్ చెయ్యడం, మరికొందరు మేడమ్.....నీ పని నువ్వు చూసుకో అంటూ సలహాలు ఇస్తూ ట్వీట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రిహన్నా తీరుపై కొందరు భారతీయులు మండిపడుతున్నారు.

ఆ రోజు దెబ్బతో వైరల్
రిపబ్లిక్ డే రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న గుడారాల్లోకి కొందరు వ్యక్తులు చొరబడి నానా హంగామా చేసి అక్కడ ఉన్న టెంట్లు, అనేక వస్తులు మొత్తం నాశనం చేశారు. ఆ సందర్బంలో కొందరు అన్నదాతలు పోలీసుల మీద తిరగబడటంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది. రిపబ్లిక్ డే రోజు దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో ప్రపంచ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.

సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు ?
భారతదేశంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలకు హాలీవుడ్ నటి రిహన్నా సంపూర్ణ మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశం విషయంలో అంతర్జాతీయంగా కొందరు జోక్యం చేసుకోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుపడుతూనే వస్తున్నారు. ఇప్పడు హాలీవుడ్ నటి, టాప్ పాప్ సింగర్ రిహన్నా రైతులకు మద్దతు తెలపడంతో కొందరు ఆమెపై విరుచుకుపడుతున్నారు. మీదేశంలో ఏ సమస్యలు లేవా ?, నీ పనినువ్వు చూసుకోకుండా మాదేశంలో సమస్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ ?, నీ తీరు చూస్తుంటే పనిపాట లేనివాళ్లు చేసే పనిలాగా ఉందని, నీ పనినువ్వు చూసుకో అంటూ రిహన్నా తీరుపై కోందరు మండిపడుతున్నారు.