ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం..!!

టీమిండియా అభిమానులకు బిగ్ అప్డేట్. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు కోహ్లీ ఆడటం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మరో స్టార్ ఆల్ రౌండర్ సిరీస్ కు దూరమయ్యాడు. ఈ మేరకు అధికారికంగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన భారత్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సమయంలో తగిలిన గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే నెలలో ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో శిక్షణ పొందుతుండగా అతడి తొడకండరాలకు గాయమైంది. కోలుకోవడానికి అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లతో పాటు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల జట్టులోనూ సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

Hardik Pandya has been ruled out of the ODI series against England with a quadriceps injury here the details

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.

 తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!
తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ ఖరారు- రూట్, ముహూర్తం..!!

కోహ్లీ డౌట్ ... హార్దిక్ ఔట్

మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది జూన్ 22న జరిగే అతని ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తేలనుంది. ఐపీఎల్ ఫైనల్‌లో కండరాల నొప్పితో బాధ పడుతున్న కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉంటూనే వేగంగా కోలుకుంటున్నాడు. అతడు కూడా అఫ్గాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. జూన్ 22న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌ను పునఃసమీక్షించనుంది.

ఆ పరీక్షలో పాస్ అయితేనే జూలైలో జరిగే ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు కోహ్లీ ఎంపికవుతాడు. సీనియర్ ఆటగాళ్ల గాయాల బెడద గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు సవాలుగా మారుతుంది. దీంతో.. బీసీసీఐ చేసే మార్పుల పైన అంచనాలు పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+