Bandi Bhageerath: బండి భగీరథ్ కు మల్కాజ్ గిరి కోర్టులో ఊరట..!
మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో పోక్సో కేసు కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhageerath)కు ఇవాళ మల్కాజ్ గిరి కోర్టులో ఊరట లభించింది. సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వీలుగా తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన మల్కాజ్ గిరి కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది.
ఈ కేసులో ఆరోపణలు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన బండి భగీరథ్ ను పోలీసులు గత నెల 16న అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు పంపారు. ఆ తర్వాత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో జైల్లోనే గడుపుతున్న ఆయన.. తాజాగా మల్కాజ్ గిరి కోర్టులో తాత్కాలిక బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. సెమిస్టర్ పరీక్షల కోసమని ఇందులో కారణం చూపారు.

దీనిపై విచారణ జరిపిన మల్కాజ్ గిరి కోర్టు.. ఇవాళ బండి భగీరథ్ వినతిని మన్నించి ఈ నెల 26 వరకూ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అరెస్టు తర్వాత జైల్లోనే ఉండి చదువుకుని పరీక్షలు రాస్తున్నట్లు సమాచారం. మరోవైపు పరీక్షలు ముగిసిన తర్వాత భగీరథ్ లొంగిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో గతంలో బండి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఆయన తండ్రి, కేంద్రమంత్రి సంజయ్ కూ విమర్శలు తప్పలేదు.














Click it and Unblock the Notifications