వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: అన్నదాతల కడుపు మండితే మీ కడుపు నిండుతుందా?, సేమ్ సీన్ రిపిట్ అయితే ?, చూద్దాం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ పంజాబ్/ ముంబాయి: పదిమందికి అన్నం పెట్టే అన్నదాతలు ఈ రోజు మా కడుపు కొట్టకండి, మాకు న్యాయం చెయ్యాండి అంటూ డిమాండ్ చేస్తూ రోడ్డున పడ్డారు. రైతలు ఆందోళనలకు దిగి చాలా రోజులు కావస్తోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మా కడుపుకొడుతోందని, కార్పోరేట్ కు పెద్దపీట వెయ్యడానికి కొత్త వ్యవసాయం చట్టాలను తెరమీదకు తెచ్చిందని అన్నదాతలు ఆరోపిస్తూ రోడ్డు ఎక్కారు. దేశరాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలకు మద్దతుగా నేడు సోమవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, రైతు సంఘాల నిరాహార దీక్షలు మొదలైనాయి. ఇదే సందర్బంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు ఎక్కువ కాకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా మూడు నెలల ముందు దేశ రాజధానిలో రైతులు ఇచ్చిన షాక్ లాంటి సంఘటనలు జరగకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి అనుకూల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్

ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్


కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన అన్నదాతలకు కడుపు మండుతోంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు మొదలైనాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరడంతో భారతదేశంతో పాటు అన్నదాతల ఆందోళనలపై ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఆ రోజు భగత్ సింగ్ జయంతి

ఆ రోజు భగత్ సింగ్ జయంతి


కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపిన వ్యవసాయ బిల్లులను దేశవ్యాప్తంగా నేటి వరకు అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి రోజే మేము రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, మా కడుపు మండుతోందని మూడు నెలల క్రితం ఢిల్లీలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు అన్నదాతలు ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా రోడ్ల మీద ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఆరోజు ఊహించని షాక్

ఆరోజు ఊహించని షాక్


మూడు నెలల క్రితం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో కుర్చున్న రైతులు. యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఒక్కసారిగా ఆవేశంతో రగిలిపోయిన అన్నదాతలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాక్టర్ ను ఇండియా గేట్ సమీపంలోకి తీసుకువచ్చి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఇండియా గేట్ దగ్గర అన్నదాతలు ఎంతో పవిత్రంగా చూసుకునే ట్రాక్టర్ కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేసిన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలు దహనం చేశారు.

దేశవ్యాప్తంగా అన్నదాతలకు మద్దతు

దేశవ్యాప్తంగా అన్నదాతలకు మద్దతు


అన్నదాతల పిలుపు మేరకు డిసెంబర్ 14వ తేదీ సోమవారం దేశ వ్యాప్తంగా ఆందోళనలు, రైతు సంఘాల నేతల నిరాహార దీక్షలు మొదలైనాయి. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ బిల్లులు, చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల కడుపు మండితే మీ కడుపు నిండుతుందా ? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

బీజేపీ రూలింగ్ రాష్ట్రాలు

బీజేపీ రూలింగ్ రాష్ట్రాలు

రైతుల నిరాహార దీక్షల సందర్బంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు ఎక్కువ కాకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా మూడు నెలల ముందు దేశ రాజధానిలో రైతులు ఇచ్చిన షాక్ లాంటి సంఘటనలు జరగకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి అనుకూల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు.

English summary
Farmers Protest: A tractor was set on fire near India Gate in the heart of Delhi three months back during protests against the controversial farm laws, now same scene repeats?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X