ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శాశ్వత నిర్మాణాలు .. ఉధృతమవుతున్న అన్నదాతల ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. గత ఏడాది నవంబర్ నుండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇక ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా రైతులు తాత్కాలిక ఆవాసాలకు బదులుగా, శాశ్వత నివాసాలను ఏర్పరచుకుంటున్నారు. ఢిల్లీకి సరిహద్దుల్లో ఇటుకలతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు రైతులు.

హర్యానా సమీపంలోని తిక్రీ సరిహద్దు వద్ద శాశ్వత ఇళ్ల నిర్మాణం
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆందోళనను రైతులు విరమించుకోవాలని కేంద్రం ఎదురుచూస్తుంది. రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు సైతం చేస్తోంది. కానీ రైతులు మాత్రం ఉద్యమం విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం పదవీకాలం ముగిసే వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన రైతులు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హర్యానా సమీపంలోని తిక్రీ సరిహద్దు వద్ద, నిరసనకారులు శాశ్వతంగా ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్-19 రెండోదశ వ్యాక్సినేషన్

ఢిల్లీ సరిహద్దుల్లో శరవేగంగా శాశ్వత నిర్మాణాలు చేస్తున్న రైతులు
ఇప్పటికే 25 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, రానున్న రోజుల్లో 1000 నుండి 2000 వరకు ఇళ్లను నిర్మించి కొన్నట్లు కిసాన్ సోషల్ ఆర్మీ చెప్తుంది. ప్రస్తుతం వారు నిర్మాణ సామగ్రి కోసం ఖర్చు చేస్తున్నారు . ప్రతి ఇంటిని నిర్మించటానికి అంచనా వ్యయం రూ. 20,000-25,000 గా పెట్టుకొని మరీ శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. తిక్రీ సరిహద్దుల్లోనే కాకుండా ఇతర సరిహద్దుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే చేపట్టారు.
బహదూర్ ఘర్ హైవే సమీపంలో నిరసనకారులు మౌలిక వసతులతో గృహాలను నిర్మిస్తున్నారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న అన్నదాతలు .. ఎండాకాలానికి తగిన ఏర్పాట్లు
రానున్నది ఎండాకాలం కావడంతో తాత్కాలిక ఆవాసాల నుండి పోరాటం సాగించాలని భావిస్తున్న రైతులు, ఈ నేపథ్యంలో శాశ్వత గృహాలను నిర్మిస్తుండటం గమనార్హం.
ఇప్పటివరకు కేంద్రంతో అనేకమార్లు, అనేక దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకునే విషయంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు మార్చి 26 వ తేదీన రైతుల ఆందోళనలు ప్రారంభించి నాలుగు నెలలు పూర్తి అవుతున్న కారణంగా మరోమారు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications