రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
కేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు చేరుకుంది. వంద రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మొండిగా వ్యవహరిస్తోంది. అటు రైతులు సైతం వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.ఇక నేటితో రైతుల ఆందోళనకు 100 రోజులు కావటంతో నేడు బ్లాక్ డే పాటిస్తున్నారు.

గత వంద రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కొనసాగుతున్న రైతుల ఆందోళన
రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టారు . అక్కడ వారు తాత్కాలికంగా వేసుకున్న గుడారాలను శాశ్వత నిర్మాణాలు గా మార్చారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కూలర్లు , ఎయిర్ కండిషనర్ ల తో సిద్ధమయ్యారు. గత వంద రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, సరిహద్దుల్లో జనం సన్నగిల్లడంతో తగ్గినట్టు కనిపిస్తున్నా, దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన విస్తరిస్తోంది. రాష్ట్రాల వారీగా రైతులు మహా పంచాయతీలు నిర్వహించి ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు . అంతర్జాతీయంగానూ రైతుల ఆందోళన పై ఆసక్తి నెలకొంది.

నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు , కుండ్లి-మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధం
వంద రోజులుగా తమ సమస్య పరిష్కారం కాని కారణంగా రైతులు ఈరోజు బ్లాక్ డే గా పాటిస్తున్నట్లు గా స్పష్టం చేశారు ఢిల్లీ శివార్లలోని కుండ్లి-మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే ను ఐదు గంటలు దిగ్బంధించాలని రైతులు నిర్ణయించారు. రహదారులను అడ్డుకోవడంతో పాటు, సాంయుక్ట్ కిసాన్ మోర్చా, హైవేల దగ్గర ఉన్న టోల్ ప్లాజాలను టోల్ చెల్లింపులు లేకుండా కొనసాగించాలని, దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు నివాసాల నుండి నల్ల జెండాలను ఎగర వేయాలని పిలుపునిచ్చింది.

నవంబర్ లో ఆందోళన ప్రారంభించిన రైతులు
మొదట పంజాబ్ మరియు హర్యానాకు చెందిన రైతులు 2020 నవంబర్‌లో తమ చలో ఢిల్లీ కవాతుతో దేశ రాజధాని వైపుకు వెళ్లారు. ఆ నెల 26 నుండి, వారు సింగు మరియు తిక్రీ వంటి వివిధ సరిహద్దు పాయింట్ల వద్ద శిబిరాలకు చేరుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఘాజీపూర్‌లో ఉత్తర ప్రదేశ్ రైతులు చేరారు. పార్లమెంటు సెప్టెంబర్‌లో అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

అనేకమార్లు ప్రభుత్వంతో చర్చలు విఫలం .. ఆందోళన ఉధృతం చేస్తున్న రైతన్నలు
ప్రతిష్టంభన నుండి బయటపడటానికి రైతుల ప్రతినిధులు మరియు ప్రభుత్వం మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ చర్చలు సఫలం కాలేదు. కేంద్రం చట్టాల రద్దుకు మొగ్గుచూపకపోగా, కొంతకాలం చట్టాలను వాయిదా వేయడానికి రైతులను అంగీకరించవలసిందిగా కోరింది. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులు సాగు చట్టాలను రద్దు చేస్తేనే తాము ఇంటికి వెళ్తామని తేల్చి చెబుతున్నారు. పోరు విత్తనాన్ని నాటామని, పంట పండితేనే ఇళ్లకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications