వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆందోళనకు ఏడు నెలలు పూర్తి.. నేడు నల్ల చట్టాల రద్దుకు గవర్నర్లకు మెమొరాండం

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అన్నదాతల ఆందోళన ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్లకు మెమోరాండం సమర్పించాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు వివిధ రాష్ట్రాల్లోని రైతులు ఆయా రాష్ట్రాల గవర్నర్లకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మెమోరాండం సమర్పిస్తున్నారు.

Recommended Video

#BharatBandh: AP Govt Extends Supports భార‌త్ బంద్‌కు వైసీపీ మ‌ద్ద‌తు... APSRTC బస్సుల నిలిపివేత
గవర్నర్ కు మెమొరాండం .. హర్యానాలో రాజ్ భవన్ కు రైతులు

గవర్నర్ కు మెమొరాండం .. హర్యానాలో రాజ్ భవన్ కు రైతులు

శనివారం హర్యానాలోని పంచకుల లోని గురుద్వారా నదా సాహిబ్ సమీపంలో సమావేశమైన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మెమోరాండం సమర్పించడానికి నిరసనకారులు గవర్నర్ నివాసం వైపు కవాతు చేశారు. ఇక రైతులు గవర్నర్ కు మెమోరాండం సమర్పించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

పంచకుల డిప్యూటీ కమిషనర్ (డిసిపి) మోహిత్ హండా మాట్లాడుతూ, ఏదైనా పరిస్థితిని పరిష్కరించడానికి మాకు తగినంత శక్తి ఉంది. పరిస్థితిని శాంతియుతంగా ఎదుర్కోవడానికి తాము ప్రయత్నిస్తామని వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాక్టర్స్ ర్యాలీ

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాక్టర్స్ ర్యాలీ

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తాము ఆశిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళన ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా రైతులు ఈ రోజు దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీని కూడా నిర్వహిస్తారు . మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గవర్నర్లకు మెమోరాండంలను సమర్పించనున్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుగా ఉన్న ఘాజీపూర్ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ యువజన విభాగం అధ్యక్షుడు టికాయత్ ,తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని, ఈ రోజు దేశవ్యాప్తంగా గవర్నర్లకు మెమోరాండంలను సమర్పిస్తామని వెల్లడించారు.

వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటున్న రైతులు

వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటున్న రైతులు

ఢిల్లీలోని సింగు, తిక్రీ మరియు ఘాజిపూర్ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళన ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా "వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ నినదిస్తున్నారు. అంతేకాదు నేడు రాష్ట్రపతి సైతం ఒక మెమొరాండం పంపుతామని, రైతు చట్టాలను రద్దు చేయడానికి ఆయనకు విజ్ఞప్తి చేస్తామని, కనీస మద్దతు ధరలకు చట్టపరమైన హామీ పొందాలని భావిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చెబుతున్నారు.

రైతుల ఆందోళనతో దేశ రాజధానిలో భద్రత కఠినం

రైతుల ఆందోళనతో దేశ రాజధానిలో భద్రత కఠినం

ఈరోజు రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేశారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు కేంద్రం యొక్క కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు వారి పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు హామీ ఇవ్వడానికి కొత్త చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని మూడు మెట్రో ప్రధాన స్టేషన్లను నాలుగు గంటల పాటు మూసివేస్తున్నట్లు గా ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా గవర్నర్ లకు మెమొరాండం

దేశ వ్యాప్తంగా గవర్నర్ లకు మెమొరాండం

1975 లో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఏడు సంవత్సరాల పాటు రైతుల నిరసనలు కొనసాగాలని గుర్తుచేస్తూ, మళ్లీ ఇప్పుడు 46 సంవత్సరాల తరువాత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి అంటూ పేర్కొన్నారు రైతు సంఘాల నాయకులు. భారతదేశం అంతటా వేలాది మంది రైతులు శనివారం వివిధ రాష్ట్రాల్లోని రాజ్ భవన్లకు ర్యాలీలలో పాల్గొనాలని పేర్కొన్నారు. సంఘీభావం తెలిపే విధంగా, అమెరికాలోని మసాచుసెట్స్‌లో కూడా అలాంటి ర్యాలీని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Marking the completion of seven months of the ongoing farmers' agitation, the protesting farmers planned to submit memorandum to governors.Protesting farmers march towards Raj Bhawans and the security tightenedin delhi and haryana, uttar pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X