వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆందోళనలో చీలిక .. కిసాన్ పరేడ్ లో హింసతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన రెండు రైతు సంఘాలు

|
Google Oneindia TeluguNews

గణతంత్ర దినోత్సవం నాడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలో భాగంగా నిర్వహించిన కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో రైతుల ఆందోళనను కీలక మలుపు తిప్పింది. ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను, ట్రక్కులను తోసుకుంటూ, చారిత్రక కట్టడాలను ముట్టడించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊహించని విధంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలతో ఘర్షణ చోటు చేసుకోగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనకు సంబంధించి 200 మంది నిరసనకారుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిసాన్ పరేడ్ లో విషాదం; ఓ రైతు మరణం..పోలీసుల ఫైరింగ్ వల్లే అంటూ రైతుల నిరసనకిసాన్ పరేడ్ లో విషాదం; ఓ రైతు మరణం..పోలీసుల ఫైరింగ్ వల్లే అంటూ రైతుల నిరసన

ఆందోళన నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ

ఆందోళన నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ

ఇదిలా ఉంటే అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, అలాగే భారతీయ కిసాన్ యూనియన్ రెండు సంఘాలు రైతుల నిరసన నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి.
నిన్న జరిగిన హింస బాధ కలిగించిందని , ఆందోళన ఈ విధంగా ఉండకూడదని ప్రకటించారు . అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ తమ ఆందోళన నిలిపివేస్తున్నట్లు, కానీ రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నాయకుడు వి ఎం సింగ్ ఘాజీపూర్ వద్ద పేర్కొన్నారు.

 నిరసన నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన భారతీయ కిసాన్ యూనియన్

నిరసన నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన భారతీయ కిసాన్ యూనియన్

రిపబ్లిక్ డే రోజున జరిగిన నిరసన తమని బాధకు గురి చేసిందని, అది ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే రోజు ట్రాక్టర్స్ మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసతో తనకు కానీ తన సంస్థకు కానీ ఎటువంటి సంబంధం లేదని వి ఎం సింగ్ పేర్కొన్నారు. వేరొకరి దిశా నిర్దేశంలో మేము నిరసనను ముందుకు తీసుకెళ్లలేమని ప్రకటించారు . నిన్నటి ఘటనలు తనకు అత్యంత బాధకు గురి చేశాయని ఆయన అన్నారు. మరోవైపు ఢిల్లీ లో నిన్న జరిగిన ఘర్షణ లు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, నిరసన విరమిస్తున్నామని చిల్లా బోర్డర్లో భారతీయ కిసాన్ యూనియన్ ప్రెసిడెంట్ ఠాగూర్ భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు.

కీలక మలుపు తిరిగిన రైతుల ఉద్యమం

కీలక మలుపు తిరిగిన రైతుల ఉద్యమం

ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ శాంతియుతంగా జరుగుతున్న రైతుల ఆందోళనలు , నిన్న జరిగిన ట్రాక్టర్స్ ర్యాలీతో హింసాత్మకంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనలు సీరియస్ గా తీసుకొని, హింసకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఇక ఈ సమయంలో కీలక రైతు సంఘాలు ఆందోళన నుండి విరమిస్తున్నట్లు ప్రకటించటం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ కొనసాగిస్తున్న రైతుల ఆందోళనను మరో మలుపు తిప్పింది.

రైతు సంఘాలలో చీలిక .. ఉద్యమం నీరు గారిపోతుందా ?

రైతు సంఘాలలో చీలిక .. ఉద్యమం నీరు గారిపోతుందా ?

తాజా పరిణామాలతో రైతుల మధ్య చీలిక మొదలైందని చర్చ జరుగుతుంది. నిన్నటి ఘటనలకు బాధ్యత వహించి రాకేశ్ టికాయత్ సమాధానం చెప్పాలని ఆందోళన నుండి వైదొలగిన రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎర్రకోట మీద నిషాద్ సాహెబ్ జెండాను ఎగరవేసి దేశ గౌరవాన్ని మంటగలిపారని రైతు సంఘం నాయకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇచ్చిన సమయం కంటే ముందుగా , బారికేడ్లను తొలగిస్తూవెళ్లి సాధించింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రైతు సంఘాలలో చీలికతో ఇప్పుడు ఉద్యమం నీరు గారిపోతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

Recommended Video

#TOPNEWS: మదనపల్లి హత్యాకాండలో ట్విస్ట్... నేనే కరోనాను సృష్టించా ! ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా

English summary
The All India Kisan Sangharsh Coordination Committee (AIKSCC) and bharatiya kisam union (BKU) on Wednesday announced they are withdrawing from the ongoing farmers' protest with immediate effect because the format of the protest in "unacceptable" to it and said deeply pained by whatever happened in Delhi yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X