రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో నిరసనలు 22వ రోజుకు చేరగా, ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు-కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక అడుగు వేశారు..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం రాత్రి రైతులకు బహిరంగ లేఖ రాశారు. మొత్తం ఎనిమిది పేజీలతో కూడిన ఆ లేఖలో.. రైతుల నిరసనల వల్ల అనేక సమస్యలు తలెత్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే, కొత్తగా పలు రకాల హామీలను సైతం తోమర్ తన లేఖలో రాసుకొచ్చారు.

పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కొన్ని పార్టీలు, యూనియన్లకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, రైతులెవరూ అలాంటి ప్రచారాన్ని నమ్మోద్దని లేఖలో రైతులకు మంత్రి విజ్ణప్తి చేశారు. ఎంఎస్‌పీపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Farmers Protest Updates: agri minister Tomar writes 8-page open letter to farmers

''కొన్ని రైతులు సంఘాలు తప్పుడు ప్రచారం, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వారిని బయటికి పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను ఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుకు చేరుకోలేకపోతున్నారు'' అని రైతులకు రాసిన లేఖలో తోమర్ పేర్కొన్నారు.

నిజానికి మంత్రి తోమర్ లేఖలో చెప్పిన ఎంఎస్‌పీపై హామీ అంశాన్ని ముందునుంచే ప్రతిపాదిస్తూ వస్తున్నా, అందుకు రైతులు అంగీకరించడంలేదు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరసనల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్రం అంటుండగా, సుప్రీంకోర్టు మాత్రం నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+