రైతుల్లో చీలిక తెస్తారా? ఎంఎస్‌పి హామీ చట్టంపై మోడీ టార్గెట్ గా రైతు సంఘాల మెలిక!!

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినప్పటికీ రాజధాని ఢిల్లీలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లోనూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోడీ సాగు చట్టాల రద్దు ప్రకటన చేసి రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆందోళన విరమించాలని సూచించారు.అయితే పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే వరకు, ప్రభుత్వం తమతో చర్చలు జరిపే వరకు ఆందోళన జరిపి తీరుతామని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని బికేయు నేత రాకేష్ టికాయత్ ఆరోపించారు.

రైతుల్లో చీలిక తెచ్చేందుకు మోడీ ప్రయత్నం .. అయినా ఆందోళన విరమించం

రైతుల్లో చీలిక తెచ్చేందుకు మోడీ ప్రయత్నం .. అయినా ఆందోళన విరమించం

మోడీ ప్రకటనతో ఆందోళన ఆపివేద్దామని కొందరు, కొనసాగిద్దామని కొందరు రైతు సంఘాల నాయకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఇదంతా రైతుల్లో చీలిక తీసుకురావటానికి మోడీ చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చేసిన తమ ఆందోళనను కొనసాగించి తీరుతామని రాకేష్ టికాయత్ తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు పేద రైతులు, కూలీలు మరియు ఇతరులకు మంచివి కావని వారికి (ప్రభుత్వానికి) అర్థమయ్యేలా చేయడానికి మాకు ఒక సంవత్సరం పట్టింది.

ఢిల్లీ బంగ్లాలలో కూర్చున్న వారిది వేరే భాష .. అందుకే ఇంతగా ఆందోళన

ఢిల్లీ బంగ్లాలలో కూర్చున్న వారిది వేరే భాష .. అందుకే ఇంతగా ఆందోళన


మేము మా భాషలో చెప్పాము, కానీ ఢిల్లీలోని బంగ్లాలలో కూర్చున్న వారికి వేరే భాష ఉంది... వారు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు, కానీ కొంతమందికి చట్టాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పి రైతులను విభజించడానికి ప్రయత్నించారు అని కిసాన్ మహాపంచాయత్‌లో రాకేష్ టికాయత్ అన్నారు.లక్నోలో శుక్రవారం నిర్ణయాన్ని ప్రకటిస్తూ మోదీ క్షమాపణలను ప్రస్తావిస్తూ కనీస మద్దతు ధర (MSP)కి హామీ ఇచ్చే చట్టం కోసం డిమాండ్‌ను ఆయన తెరమీదకు తెచ్చారు. ప్రభుత్వం పరిశీలించాల్సిన ఇంకా అనేక రైతుల సమస్యలు ఉన్నాయని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ మద్దతిచ్చిన ఎంఎస్‌పి డిమాండ్‌పై ప్రశ్నిస్తున్న రైతులు

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ మద్దతిచ్చిన ఎంఎస్‌పి డిమాండ్‌పై ప్రశ్నిస్తున్న రైతులు


మా పోరాటం కొనసాగుతుంది ఎందుకంటే మా సమస్యలు మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మాత్రమే పరిమితం కావు. రైతులకు సంబంధించి అనేక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో మాట్లాడాలి. మేం ఎక్కడికీ వెళ్లడం లేదు. దేశమంతటా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం అని రాకేష్ టికాయత్ చెప్పారు.2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను మద్దతిచ్చిన ఎంఎస్‌పి డిమాండ్‌పై ప్రధాని సమాధానం చెప్పాలని టికాయత్ అన్నారు.

Recommended Video

    AP 3 Capitals లేనట్టేనా... ఇప్పటికి లేనట్టా ?? Jagan ప్లాన్ ? || Oneindia Telugu
    మళ్ళీ కమిటీ దేనికి ? మీరిచ్చిన నివేదిక అమలు చెయ్యండి అంటూ డిమాండ్

    మళ్ళీ కమిటీ దేనికి ? మీరిచ్చిన నివేదిక అమలు చెయ్యండి అంటూ డిమాండ్

    ఎంఎస్‌పికి హామీ ఇచ్చే చట్టం అవసరమని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సూచించిన కమిటీలో మోదీ కూడా ఉన్నారని ఆయన అన్నారు. "ఈ కమిటీ నివేదిక ప్రధానమంత్రి కార్యాలయంలో ఉందని, దీనికోసం కొత్త కమిటీ అవసరం లేదు... మీరు మీ స్వంత కమిటీ నివేదికను అమలు చేయండి అని టికాయత్ అన్నారు.లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతుల మృతికి సంబంధించి అరెస్టయిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌ను కూడా రాకేష్ టికాయత్ పునరుద్ఘాటించారు. రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేసే వరకు, మద్దతు ధరతో పాటుగా రైతుల సమస్యలపై ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసేవరకూ పోరాటం కొనసాగించి తీరుతామని రైతు సంఘం నాయకులు తేల్చి చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+