వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫరూక్ అబ్దుల్లా వర్సెస్ పండిట్స్ : జ్యేష్టాదేవి దర్శనానికి యత్నం, అడ్డుకున్న పండిట్లు ...

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జ్యేష్ఠాదేవిని దర్శించుకుంటానని సవాల్ చేసిన జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భారీగా గుమికూడిన ప్రజలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా, మరోవైపు పండిట్లు మోడీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.

ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..! ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..!

అమ్మవారి సేవలో ..
కశ్మీర్‌లో జ్యేష్ఠాదేవి ఆలయం ఫేమస్. ఇక్కడున్న వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. అయితే అమ్మవారిని తాను దర్శించుకుంటానని ఫరూక్ అబ్దుల్లా సవాల్ చేశారు. దీనిని హిందువులు నిరసిస్తూ అడ్డుకుంటామని ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలో గురువారం ఆలయం వద్దకు ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. అయితే అప్పటికే భారీగా కశ్మీర్ పండిట్లు మొహరించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయంలోకి వచ్చేందుకు అబ్దుల్లా ప్రయత్నించగా ..పండిట్లు అడ్డుకున్నారు. అంతేకాదు ప్రధాని మోడీ, బీజేపీ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీంతో తాను చేసేదేమీలేక వెనుదిరిగారు అబ్దుల్లా.

Farooq Abdullah heckled, booed by Kashmiri Pandits in Srinagar temple, forced to return

వెనుదిరిగిన అబ్దుల్లా ...
ఫరూక్ అబ్దుల్లా హయాంలోనే అమ్మవారి ఆలయాన్ని పట్టించుకోలేదని పండిట్లు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని నేత .. ఇప్పుడు అమ్మవారి పేరుతో రాజకీయాలేంటి అని ప్రశ్నిస్తున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం దర్శనాలు చేయడం సరికదాని దుయ్యబట్టారు. అక్కడ భారీగా కశ్మీర్ పండిట్లు పొగవడంతో .. అబ్దుల్లా అక్కడినుంచి వెనుదిరిగారు. ఆలయంలోకి వెళ్లకుండా .. అమ్మవారికి ప్రార్థనలు చేయకుండానే వెళ్లిపోయారు.

English summary
national Conference president and former Jammu and Kashmir Chief Minister Farooq Abdullah was heckled today in Srinagar by group of Kashmiri Pandits. He was prevented from entering the Jyestha Devi temple. When Farooq Abdullah reached the temple, he was greeted with angry sloganeering. People booed him and raised slogans praising Prime Minister Narendra Modi and the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X