తమిళనాడు, బెంగాల్, కేరళలో గెలిచేది వీళ్లే-ఫరూక్ అబ్దుల్లా జోస్యం..!
ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా పార్లమెంట్ లో మహిళా బిల్లు నెగ్గించుకోవడంలో విఫలమైన కేంద్రం.. ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేసింది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం పడటం ఖాయం. దీంతో ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ దిగ్గజం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) మూడు కీలక రాష్టాల్లో ఫలితాలపై తన అంచనాల్ని వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి మూడు కీలక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. "నేను మీకు చెబుతున్నాను, ఇక మిగతాది దేవుడికే తెలుసు. బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుస్తున్నారు, కేరళలో కాంగ్రెస్ గెలుస్తోంది, తమిళనాడులో (ఎంకే) స్టాలిన్ పార్టీ (డీఎంకే) గెలుస్తోంది. ఇది దేవుడి ఆశీర్వాదం," అని హజ్రత్‌బాల్‌లో జోస్యం చెప్పారు.

కేంద్రం చేపట్టిన 'నషా ముక్త్ భారత్ అభియాన్'పై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలపై యుద్ధంలో గెలవడానికి ప్రజల మద్దతు అత్యవసరం అన్నారు. "తల్లిదండ్రులు, ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వనంత వరకు, ప్రభుత్వం మాదకద్రవ్యాల ముప్పును అంతం చేయలేదన్నారు. ప్రజల మద్దతే ముఖ్యమని తెలిపారు. వారు మద్దతు ఇస్తే, దైవ సంకల్పంతో ఈ ముప్పు అంతమవుతుందని అబ్దుల్లా తెలిపారు. అలాగే మధ్యప్రాచ్యంలోని సంఘర్షణపై స్పందిస్తూ.. శాంతి చాలా అవసరమని, ఆ యుద్ధం వీలైనంత త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications