Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫరూక్ అబ్దులాకు కరోనా పాజిటివ్: త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ ట్వీట్

శ్రీనగర్: నేసనల్ కాన్ఫెర్స్ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కరోనావైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు.

'మా నాన్నకు కరోనా పాజిటివ్‌గా అయ్యింది. కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. దీంతో నేను, మా కుటుంబసభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాం. గత కొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా'అని ఒమర్ ట్వీట్ చేశారు.

Farooq Abdullah Tests Covid Positive, Son Omar Says Family Self-Isolating

కాగా, ఫరూక్ అబ్దుల్లా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అబ్దుల్లా, అతని కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇక జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం కొత్తగా 235 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 30వేలు దాటింది. శ్రీనగర్ జిల్లాలోనే కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. మహారాష్ట్రలోనే దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికిపైగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలంతా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+