friend: ఫ్యాషన్ డిజైనర్, హోటల్ లో, గోవా రిసార్ట్ లో డ్రగ్స్+ హల్వా, కట్ చేస్తే ? ఆ సీన్ తో బ్లాక్ మెయిల్!

ముంబాయి/పూణే/న్యూఢిల్లీ: ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న యువతి సాఫ్ట్ వేర్ కోర్సు చేస్తూ జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. లేడీ ఫ్యాషన్ డిజైనర్, హైకోర్టులో లాయర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి స్టార్ హోటల్ లో కలిశారు. ఆ సమయంలో స్వీట్స్ లో డ్రగ్స్ కలిపి ఆమెతో బలవంతంగా తినిపించి అత్యాచారం చేశాడు. ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు అడ్డం పెట్టుకుని తరువాత గోవాకు పిలుచుకుని వెళ్లి మళ్లీ అత్యాచారం చేశారు.

రెండు చోట్ల తీసిన వీడియోలు, ఫోటోలు అడ్డం పెట్టుని బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర లక్షలరూపాయలు డబ్బు, బంగారు నగలు లూటీ చేశారు. అనంతరం బాధితురాలి బంధువుకే ఫోటోలు పంపించడం కలకలం రేపింది. ఈ దందాలో నిందితుడితో పాటు మరో ఇద్దరు మహిళల మీద బాధితురాలు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది.

 లేడీ ఫ్యాషన్ డిజైనర్

లేడీ ఫ్యాషన్ డిజైనర్

లాతూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల కరీనా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పూణే చేరుకుని ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న కరీనా ఖాలీ సమయంలో సాఫ్ట్ వేర్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నది. జీవితంలో సెటిల్ కావాలని కరీనా అనేక ప్రయత్నాలు చేస్తున్నది.

అదిరిపోయే అందం.......ఇన్ స్టాగ్రామ్ లో ఫ్రెండ్

అదిరిపోయే అందం.......ఇన్ స్టాగ్రామ్ లో ఫ్రెండ్

ఇదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఇన్ స్టాగ్రామ్ లో కరీనాకు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత ఆ వ్యక్తి 28 ఏళ్ల వయసు ఉన్న కౌశిక్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడిని కరీనాకు పరిచయం చేశాడు. కౌశిక్ ఢిల్లీ హైకోర్టులో లాయర్ గా పని చేస్తున్నాడని ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్ కరీనాకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ముగ్గురు సోషల్ మీడియాలో, ఫోన్లలో టచ్ లో ఉన్నారు. కరీనా చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజుకుగా, పొడవుగా సినిమా హీరోయిన్ లా ఉండటమే కాకుండా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మంచిమంచి డ్రెస్ లు వేస్తోంది.

ఢిల్లీ నుంచి ఎస్కేప్ అయిన లేడీ

ఢిల్లీ నుంచి ఎస్కేప్ అయిన లేడీ

కౌశిక్, అతని స్నేహితుడు ఢిల్లీకి రావాలని ఫ్యాషన్ డిజైనర్ కరీనాపై ఒత్తిడి చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన కరీనా పూణే నుంచి ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని కౌశిక్ కరీనా మీద ఒత్తిడి చేశాడు. తాను నిన్ను పెళ్లి చేసుకోనని కరీనా తేల్చి చెప్పింది. తరువాత అదే రోజు కౌశిక్ తో పాటు మరో ఫ్రెండ్ కు సమాచారం ఇవ్వకుండా కరీనా ఢిల్లీ నుంచి పూణే వెళ్లిపోయింది.

హోటల్ లో రూమ్.... హల్వాలో డ్రగ్స్

హోటల్ లో రూమ్.... హల్వాలో డ్రగ్స్

కరీనాను కలవడానికి కౌశిక్ అతని స్నేహితుడు ట్యాక్సీలో పూణే వెళ్లారు. పని మీద పూణే వచ్చామని, మాకు బస చెయ్యడానికి మంచి హోటల్ బుక్ చెయ్యాలని కౌశిక్ ఫిబ్రవరి 26వ తేదీన కరీనాను వేడుకున్నాడు. పూణే సిటీలోని ఖరాది ప్రాంతంలోని ఓ హోటల్ లో కరీనానే రూమ్ బుక్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన రాత్రి పూణే చేరుకున్న కౌశిక్, అతని స్నేహితుడు, కరీనా కలిసి హోటల్ లో భోజనం చేశారు. తరువాత తాను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన స్వీట్లు తినాలని కౌశిక్ ఫ్యాషన్ డిజైనర్ కరీనా మీద ఒత్తిడి చేశాడు.

పూణే హోటల్ లో..... గోవా రిసార్టులో రేప్

పూణే హోటల్ లో..... గోవా రిసార్టులో రేప్

కౌశిక్ ఒత్తిడి ఎక్కువ కావడంతో స్వీట్లు తిన్న కరీనా స్పృహ కోల్పోయింది. తరువాత హోటల్ గదిలో కౌశిక్ తన మీద అత్యాచారం చేశాడని, ఆ సమయంలో తన నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడని కరీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నగ్న ఫోటోలు, వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ తనను బెదిరించి గోవాకు పిలిపించుకున్నాడని కరీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, మళ్లీ గోవాలో బెదిరించి ఆ రోజు తన మీద అత్యాచారం చేశాడని ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బ్లాక్ మెయిల్ చేసి ముంచేశారు

బ్లాక్ మెయిల్ చేసి ముంచేశారు

పూణేలోని హోటల్ లో, గోవాలోని రిసార్టులో తన మీద రేప్ చేసే సమయంలో నగ్న వీడియోలు, ఫోటోలు తీసిన కౌశిక్ అతని స్నేహితులు తనను ఇన్ని రోజులు బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి బంగారు నగలు, లక్షల రూపాయల నగదు లూటీ చేశారని కరీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది .ఇంతసేసిన తరువాత మళ్లీ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి తాను నిరాకరించానని, అందుకే మా బంధువులకు తన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపించారని, తన పరువు మొత్తం పోయిందని ఆరోపిస్తూ కరీనా పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recommended Video

    Indian-American Mala Adiga Appointed As Jill Biden's Policy Director
    కరోనాతో బతికిపోయారు

    కరోనాతో బతికిపోయారు

    ఫ్యాషన్ డిజైనర్ కేసు విషయంలో పూణేలోని చందన్ నాగే పోలీస్ స్టేసన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విషయంలో విచారణ చేస్తున్న పోలీసు అధికారి సునీల్ తోప్టే PTIతో మాట్లాడుతూ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీ హైకోర్టు లాయర్ అని చెప్పుకుంటున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరి మీద ఫిర్యాదు చేసిందని అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని పై అధికారులకు పంపించి తరువాత చర్యలు తీసుకుంటామని సునీల్ తోప్టే చెబుతున్నారు.

    ఢిల్లీలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న సందర్బంగా ఫ్యాషన్ డిజైనర్ పెట్టిన కేసులోని ఎఫ్ఐఆర్ లో పేర్లు ఉన్నవారిని తాము ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారి సునీల్ తోప్టే చెప్పారని పీటీఐ తెలిపింది. కేసు విచారణలో ఉన్న సందర్బంగా ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన పేర్లు అన్ని రహస్యంగా పెట్టామని పూణే పోలీసు అధికారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+