ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినిపై అంకుల్ అత్యాచారం

అమ్మాయి పోలీసులకు ఈ నెల 19వ తేదీన ఫిర్యాదు చేసింది. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన లక్నోలో నివసించే తన అంకుల్ సందీప్ కోహ్లీ పని మీద ఢిల్లీ వచ్చాడని, అతను తన తండ్రి స్నేహితుడని ఆమె వివరించింది.
తనను ఢిల్లీలోని జింఖానా క్లబ్‌కు తనను ఆహ్వానించాడని, అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని ఆ అమ్మాయి చెప్పింది.
అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, లక్నోకు ఓ పోలీసు బృందాన్ని పంపించారు. అయితే, కోహ్లీ జాడ తెలియలేదు. అతని అరెస్టు కోసం పోలీసులు కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారంట్ పొందారు.












Click it and Unblock the Notifications