మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు యువ క్రికెటర్లు దుర్మరణం..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు క్రికెటర్లు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా నందగావ్ ఖండేశ్వర్ తాలూకా శింగనాపూర్ వద్ద యువ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొన్నది. దీంతో ఈ ఘటనలో నలుగురు యువ క్రికెటర్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరంతా స్థానికంగా నిర్వహిస్తున్న టెన్నిస్-బాల్ క్రికెట్ టోర్నమెంట్ టోర్నిలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇక, ఈ సంఘటనలో అమరావతి నగరానికి చెందిన రీహరి రౌత్, జయూశ్ బహాలే, సుయాశ్ అంబర్టే, సందేశ్ పదార్ అనే నలుగురు యువకులు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలోని తాలూకా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అమరావతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన నుంచి మరో 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

యావత్మల్ టెంపో ట్రావెల్స్ ఆధ్వర్యంలో...:
అమరావతి నగరానికి చెందిన యువకులు యావత్మల్ టెంపో ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్ కోసం బయలుదేరారు. వీరంతా రుక్మిణి నగర్, రవినగర్‌కు చెందిన 25 మంది యువ క్రికెటర్లుగా గుర్తించారు. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో శింగనాపూర్ ఫోర్క్ సమీపంలో వేగంగా వస్తున్న సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ ట్రక్కు ట్రావెల్ టెంపో ఢీకొనడం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలంలో ఒకరు ప్రాణాలు విడవవగా, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరో ముగ్గురు మృతిచెందారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications