అతనితో సంబంధం పెట్టుకున్న కూతురిని చంపేసిన తండ్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో తన 13 ఏళ్ల కూతురిని హత్య చేసిన వ్యక్తిని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం శనివారంనాడు అరెస్టు చేసింది. మార్చి 7వ తేదీన అదృశ్యమైన బాలిక మార్చి 9వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ట్రోనికాలో శవమై తేలింది

ఓ యువకుడితో కలిసి అతనికి తన కూతురు కనిపించింది. దాంతో అతను కూతుర్ని చంపేశాడు. యువకుడిని కలవడానికి మార్చి 7వ తేదీన కూతురు బయటకు వచ్చింది. ఆమె కోసం అతను వెళ్లాడు.

Father arrested for killing 13-year-old daughter over relationship with boy in Delhi

కూతురిని హత్య చేసిన రోజునే తండ్రి తన కూతురు కనిపించడం లేదంటూ కారవాల్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ట్రోనికా సిటీలో ఓ శవం కనిపించినట్లు పోలీసులకు 9వ తేదీన సమాచారం అందింది. బంధువులు చూసి బాలికను గుర్తించారు.

కారవాల్ నగర్‌లోని సీసీటీవి కెమెరాలను అన్నింటినీ పోలీసులు పరిశీలించారు. ఆమె ఓ బైక్‌పై వెనక కూర్చుని వెళ్లినట్లు తేలింది. ఆమెను బైక్‌పై తీసుకుని వెళ్లిన వ్యక్తి ఆమె తండ్రిలాగే కనిపించాడు.

పోలీసులు విచారించడంతో తండ్రి నేరాన్ని అంగీకరించాడు. తాను కూతురిని కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించాడు. నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A team of Delhi and Uttar Pradesh Police on Saturday arrested a man for killing his 13-year-old daughter in Delhi's Karawal Nagar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి