వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రిరూప రాక్షసుడు: పెళ్లాంతో గొడవ, ఇద్దరు కూతుళ్లను మట్టుబెట్టిన నీచుడు

|
Google Oneindia TeluguNews

తండ్రి.. పిల్లల బాగోగులు చూసుకోవాలి. మంచి చెడ్డ ఆరాతీయాలి. ఓ సంరక్షకుడిగా ఉండాలి. కానీ అతను పిల్లల పాలిట కాలయుముడిగా మారాడు. తన పిల్లలనే మట్టుబెట్టి నాన్న అనే స్థానానికి అపప్రద తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతుంది.

 పచ్చని కాపురంలో..

పచ్చని కాపురంలో..

యూపీలోని సుర్జాపూర్‌కి చెందిన హరి సోలంకి అనే జంట ఉంటుంది. వారికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలానే గురువారం కూడా ఘర్షణ చెలరేగింది. కానీ అది కుటుంబంలో విషాదం నింపింది.

భార్యతో గొడవ..

భార్యతో గొడవ..

మద్యం సేవించి వచ్చి, భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. మత్తులో ఉన్న భర్త.. తన ఇద్దరు కూతుళ్లపై తన ప్రతాపాన్ని చూపించాడు. బయటకొచ్చి తన కూతుళ్లపై దాడి చేశాడు. దీంతో చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. ఆరేళ్లు, మూడేళ్లు గల ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. తమ ఇంటి సమీపంలో కూతురు మృతదేహాం లభించింది. మరొ కూతురి డెడ్‌బాడీ పాడుబడ్డ భవనంలో లభించింది.

హతమార్చి..

హతమార్చి..

చిన్నారులను మట్టుబెట్టి హరి సోలంకి పారిపోయాడు. ఘటన తర్వాత అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. మరునాడు హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కింద అతనిపై కేసులు నమోదు చేశారు. హరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తలపై గాయాలు

తలపై గాయాలు

ఇద్దరు చిన్నారుల తలపై గాయాలు గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని బలంగా కొట్టడంతోనే మృతిచెందారని పేర్కొన్నారు. నిందితుడికి కఠినశిక్ష విధించేలా కోర్టుకు ఆధారాలు సమర్పిస్పామని తెలిపారు. సుర్జాపూర్‌లో ఇద్దరు చిన్నారుల హత్యతో భీతవాహ వాతావరణం నెలకొంది.

English summary
uttar Pradesh Police on Friday arrested a man who allegedly killed his two daughters in a drunken state here in Surajpur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X