మోడీ చెవిలో మా నాన్న ఈ విషయమే చెప్పారు: అఖిలేష్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన నాటి సమయంలో వేదికపై సమాజ్‌వాది పార్టీ నతే ములాయం సింగ్ యాదవ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ పలకరించిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రధాని దగ్గరకు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన నాటి సమయంలో వేదికపై సమాజ్‌వాది పార్టీ నతే ములాయం సింగ్ యాదవ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ పలకరించిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయన చెవిలో ఏదో చెప్పారు ములాయం.
దీంతో, మోడీకి ములాయం ఏం చెప్పారా? అంటూ ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకున్నారు. మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి. అయితే మోడీ చెవిలో ములాయం ఏం చెప్పారో ఆయన కుమారుడు అఖిలేష్ సింగ్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

'కొంచెం చూసుకోండి... ఇతను నా కుమారుడు అఖిలేష్' అని చెప్పారని తన గురించి చెప్పారని అఖిలేష్ తెలిపారు. 'మీరు నమ్మకపోయినా ఇది నిజం'అని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అఖిలేష్ తెలిపారు. కాగా, బీజేపీ చేసిన తప్పుడు ప్రచారం వల్లే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని అఖిలేష్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications