కూతురిపై కన్నతండ్రి పలుమార్లు అత్యాచారం...150 ఏళ్ల జైలు శిక్ష..
ప్రస్తుత సమాజంలో కామాంధుల చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వయస్సు, వావి వరుసలు మర్చిపోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు చిన్న పిల్లలను సైతం వదిలపెట్టడం లేదు. పసిపిల్లల నుంచి పండుముదుసలి వరకూ అందరూ కామాందులకు బలైపోతున్నారు. కన్న కూతురిని అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే ఆ మైనర్ కుమార్తె పాలిట శాపమయ్యాడు.
కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయితండ్రి.. ఏ కష్టం రాకుండా కన్న కూతురుని జాగత్రగా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కూతురిపై కన్నేసాడు. ఒకటి కాదు రెండుకాదు పలుమార్లు కన్నకూతురిపై లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడు. నిత్యం తండ్రి పెట్టే వేదింపులు భరించలేక చిన్నారి తల్లి చివరికి తల్లికి జరిగిన విషయమంతా చెప్పింది. 42ఏళ్ల ఆ తండ్రికి కేరళ కోర్టు ఏకంగా 150 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద ఈ కఠిన శిక్షను విధిస్తూ కేరళ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. దీంతోపాటు నాలుగు లక్షల జరిమానా కూడా విధించిందిం. అందులో కోర్టు రెండు లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
బాధితురాలికి నష్టపరిహారాన్ని నిర్ణయించాల్సిందిగా మంజేరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి కోర్టు సిఫారసు చేసింది. అయితే, ఈ సంఘటన 2022లో జరిగిందని కలికావు పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. బాధితురాలు దోషి ముగ్గరు భార్యలలో ఒకరి కుమార్తె అని, ఆ బాలికపై తండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు వివరించారు.
IPC సెక్షన్ 376(3) ప్రకారం పదహారేళ్లలోపు బాలికపై అత్యాచారం పాల్పడిన నేరానికి ముప్పయేళ్ల జైలుశిక్ష, పదహారేళ్లలోపు బాలికపై లైంగిక దాడి చేసినందుకు గానూ POCSO చట్టంలోని సెక్షన్ 4(2) ప్రకారం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది కేరళ కోర్టు. వీటితోపాటు పిల్లలపై ఒకటి కంటే ఎక్కువసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో చట్టంలోని సెక్షన్‌లు 5(l) ప్రకారం, శిక్షను విధించింది. ఇంకా పలు సెక్షన్లతో దోషికి శిక్ష విధించడం జరిగింది.












Click it and Unblock the Notifications