వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రచూడ్ v/s చంద్రచూడ్ : నాడు తండ్రి ఐపీసీ 497ను సమర్థించారు..నేడు కొడుకు రాజ్యాంగ విరుద్ధమన్నారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

సెక్షన్ 497 ను నేడు సమర్ధించిన డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు వివాహేతర సంబంధం నేరం కాదని చెబుతూ గురువారం కీలక తీర్పునిచ్చింది. ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో ఒక ఆసక్తికరమైన సంగతి ఉంది. ఈ ధర్మాసనంలో జడ్జిగా జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇంకా ఇంట్రస్టింగ్ ఏమిటంటే... 33 మూడేళ్ల క్రితం ఇదే సెక్షన్ 497కు సంబంధించి నాడు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ రూలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇదే కేసుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి రూలింగ్‌ను కాకుండా తన వేరు అభిప్రాయన్ని చెప్పారు. 33 ఏళ్ల క్రితం సీనియర్ చంద్రచూడ్ తీర్పు చెబుతూ అన్ని వివాహేతర సంబంధాలు కాకపోయినప్పటికీ కొన్ని మాత్రం నేరాలుగా పరిగణించాల్సిందేనని చెప్పారు. కానీ గురువారం జూనియర్ చంద్రచూడ్ మాత్రం తండ్రి తీర్పుతో విబేధిస్తూ అసలు అక్రమసంబంధాలు నేరపూరితం కాదని పేర్కొన్నారు.

<strong>ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు</strong>ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధం...భార్య భర్త సొత్తు కాదు

అంతేకాదు పైళ్ళైన మహిళ కేవలం తన భర్తతోనే శృంగారంలో పాల్గొనాలని లేదని ఆమె భర్త సొత్తు కాదని అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. 1985లో జస్టిస్ చంద్రచూడ్ తండ్రి సీనియర్ చంద్రచూడ్ మాత్రం సెక్షన్ 497 యొక్క రాజ్యాంగ సమ్మతిని సమర్థించారు. సౌమిత్రి విష్ణు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నాటి ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న చంద్రచూడ్ సింగ్...భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497ను తొలగిస్తే పూర్తి స్థాయిలో అక్రమసంబంధాలు ఏర్పడుతాయని చెబుతూ ఇది రాజ్యాంగ సమ్మతమేనంటూ తీర్పు చెప్పారు. సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని అక్రమసంబంధాలను నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తద్వారా వివాహ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Father and Son give differnet opinion on IPC section 497

ఇదిలా ఉంటే మరో కేసుతో కూడా తండ్రి చంద్రచూడ్‌తో విబేధించారు జూనియర్ చంద్రచూడ్. వివాదాస్పదమైన ఏడీఎం జబల్‌పూర్ కేసులో సీనియర్‌ తీర్పుతో విబేధించారు జూనియర్. 1976లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సమర్థించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సీనియర్ చంద్రచూడ్ కూడా సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ తీర్పుతో కూడా జూనియర్ చంద్రచూడ్ విబేధించారు. ఎమర్జెన్సీ విధించడమంటే ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేయడమేనని అది రాజ్యాంగ విరుద్ధమంటూ జూనియర్ చంద్రచూడ్ చెప్పారు.

English summary
Thirty three years ago, his father ruled that the society's interest required that at least a limited class of adulterous relationship is punishable by law.On Thursday, Justice DY Chandrachud overruled his father, Justice YV Chandrachud, yet again, to declare adultery unconstitutional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X