బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Children: స్కూల్ దగ్గరకు వెళ్లి పిల్లలను పిలుచుకుని వెళ్లిన తండ్రి ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అప్పులు ఎందుకు చేస్తున్నారో, అప్పులు తీసుకున్న తరువాత ఎందుకు తీర్చలేక సతమతం అవుతున్నారో తెలీక కొంత మంది సతమతం అవుతున్నారు. అప్పులు చేసిన ఓ వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పులు ఇచ్చిన వారు ఎంత చెప్పినా మాట వినకపోవడంతో అతను విసిగిపోయాడు.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అళంద పట్టణంలోని ఓ దేవాలయం సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి బావిలో దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. అళందలోని నేకర కాలనీకి చెందిన సిద్ద మల్లప్ప (35) తన ఇద్దరు పిల్లలు మనీష్(11), శ్రేయా(10)లను బావిలో తోసేసి అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Father who killed two children committed suicide, knowing the real matter

సిద్ద మల్లప్ప మార్కెట్ ప్రాంతంలో ఓ కిరాణా షాపు నడుపుతున్నాడు.

నేతాజీ పాఠశాలలో మనీష్ 5వ తరగతి, శ్రేయా 4వ తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సాయంత్రం సిద్ద మల్లప్ప పాఠశాల నుంచి పిల్లలను బైక్‌పై ఇంటికి పిలుచుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో బావి దగ్గర బైక్‌ను ఆపిన సిద్ద మల్లప్ప ఇద్దరు పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి బావిలో పడేశాడు. తరువాత అదే బావిలో దూకి సిద్ద మల్లప్ప ఆత్మహత్య చేసుకున్నాడు.

Bajrang Dal: బస్ స్టాండ్ పక్కనే తల్వార్ తో హిందూ యువకుడిని నరికేశాడు, సీసీటీవీల్లో ?Bajrang Dal: బస్ స్టాండ్ పక్కనే తల్వార్ తో హిందూ యువకుడిని నరికేశాడు, సీసీటీవీల్లో ?

సిద్దమల్లప్ప భార్య అనారోగ్యంతో ఉండడంతో చాలా అప్పులు చేశాడు. ఈ కారణంగానే పిల్లలను బావిలో పడేసి, ఆపై బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలంద పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలిద్దరి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. అయితే సిద్ద మల్లప్ప మృతదేహం కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

English summary
Father who killed two children committed suicide, knowing the real matter in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X