రిపబ్లిక్ డే వేడుకల్లో ఉగ్రదాడులకు కుట్ర, ఢిల్లీ లో హై అలర్ట్

రిపబ్లిక్ డే వేడుకల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు కుట్ర పన్నారు. ఆఫ్ఘన్ తరహాలో దుస్తులు ధరించి దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ముష్కరులు కుట్ర పన్నారు. ఆఫ్ఘన్ తరహాలో దుస్తులు ధరించి దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

దొంగ పాస్ పోర్టులతో ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. ఈ నేపథ్యంలో జనవరి 26న దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు మన నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

దొంగ పాస్ పోర్టులపై కొంతమంది పాక్ జాతీయులు దేశంలోకి చొరబడిన విషయం పసిగట్టగానే ఏ క్షణంలోనైనా బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించగానే దేశ రాజధాని ఢిల్లీ లో హై అలర్ట్ ప్రకటించారు.

Fearing Republic Day Terror Attack, Delhi Metro on High Alert

ఢిల్లీ లో ఒకవైపు రిపబ్లిక్ డే రిహార్సల్స్ చేస్తూనే మరోవైపు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం సైతం అప్రమత్తమైంది. పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించిన తర్వాతే పెరేడ్ కు అనుమతి ఇవ్వనున్నారు.

ఈ ఏడాది మన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు హాజరుకానున్నారు. పాక్ తీవ్రవాదులు చొరబడిన నేపథ్యంలో అబుదాబి యువరాజుకు భద్రత కూడా పెంచారు. ఎయిర్ అంబులెన్స్ లను కూడా తనిఖీ చేయాలని కూడా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+