మోడీ భేటీ: బెంగళూరు బంద్: అనుమతి లేదు, రామలింగా రెడ్డి, ప్రధాని జోక్యం, గోవాతో!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరు వస్తున్న సందర్బంగా వాటల్ నాగరాజ్ తోసహ కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరు బంద్ కు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి హెచ్చరించారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు
బంద్ లు నిర్వహించిన సమయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వకూడదని ఇప్పటికే సుప్రీం కోర్టు సూచించిందని మంత్రి రామలింగా రెడ్డి గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాల్సిన భాద్యత రాష్ట్ర ఫ్రభుత్వానికి ఉందని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.

ప్రశ్నించే హక్కు ఉంది
చట్ట ప్రకారం అందరూ సమస్యలపై ప్రశ్నించి పోరాటం చెయ్యడానికి అవకాశం ఉందని, కావాలంటే బెంగళూరులోని ఫ్రీడం పార్క్ లో ధర్నా నిర్వహించుకోవచ్చని, అందుకు తాము అభ్యంతరం చెప్పమని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే !
బంద్ నెపంతో బెంగళూరు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎవరైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రామలింగా రెడ్డి హెచ్చరించారు. బెంగళూరు బంద్ తో సహ కర్ణాటక బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు ప్రకటించదని మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు.

ప్రధాని జోక్యం చేసుకంటే !
మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించి సమస్య పరిష్కారం చేస్తే బెంగళూరు బంద్ నిర్వహించమని వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ అన్నారు. అలా చెయ్యకుంటే బెంగళూరు బంద్ కొనసాగిస్తామని వాటల్ నాగరాజ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కుట్ర
ఫిబ్రవరి 4వ తేదీ బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో జరుగుతున్న బీజేపీ పరివర్తనా యాత్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రధాని నరేంద్ర మోడీ సభను అడ్డుకోవడానికి బంద్ కు మద్తతు ఇస్తోందని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు.

చరిత్రలోనే లేదు
సెలవు రోజులు, ఆదివారం బంద్ చేసినట్లు కర్ణాటక చరిత్రలోనే లేదని ఆర్. అశోక్ అన్నారు. బీజేపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా పక్కా ప్లాన్ వేసి ఆదివారం బంద్ చేయిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications