మృతి: మహిళా ఐఏఎస్ అధికారిపై చెప్పులతో దాడి!

బెంగళూరు: మైసూరులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది! ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతికి కారణమంటూ మహిళా ఐఏఎస్ అధికారిణి పైన చెప్పులదో దాడి చేశారు. దాడికి గురైన అధికారి పేరు రష్మీ మహేష్. ఆమె మైసూర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్టర్ జనరల్.

ఈ సంఘటన బుధవారం జరిగింది. మైసూర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఏటీఐ)లో మెస్ మేనేజర్‌గా పని చేస్తున్న ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి నేపథ్యంలో మృతుడి తరఫు బంధువులు ఈ అధికారిణిపై దాడికి దిగారు.

ఏటీఐలో వెంకటేశ్ (53) అనే వ్యక్తి మెస్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సంప్‌లోని నీటి పరిమాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. అయితే ఏటీఐ అధిపతిగా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రష్మీ మహేశ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటేశ్ కొడుకు ఆరోపించాడు.

Female IAS officer attacked after government official's alleged suicide

అంతేకాక ఏటీఐ ప్రాంగణంలోనే రష్మీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశాడు. దీంతో పెద్ద సంఖ్యలో జన సమూహం గుమిగూడింది. దీంతో పోలీసుల సలహా మేరకు రష్మీ సాయంత్రం ఏటీఐ నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో మృతుడి బంధువర్గానికి చెందిన కొందరు రష్మీ వెంటపడ్డారు.

కొంతదూరం వెళ్లిన తర్వాత ఆమెను పట్టుకొని చెప్పులు, బూట్లతో దాడి చేశారు. అక్కడికి సమీపంలోనే ఉన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారిణి రష్మీ మహేష్ పైన దాడి కేసులో పందొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+