వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో క్రూరమృగాల మధ్య ఆ మహిళ సాహసం.. ఏం చేస్తుందో తెలుసా!!

|
Google Oneindia TeluguNews

ఆమె సాహసం నిజంగా ప్రశంసనీయం. ఆమె ధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం. పని పట్ల ఆమె నిబద్ధత అనుసరణీయం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమె పేరు ఫాతిమా రాణి. అడవిలో చాలా దూరం నడిచి వెళ్లి ఆమె తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తీరు నిజంగా ఆదర్శనీయం. ఇంతకీ ఆమె ఏం చేస్తారంటే..

దట్టమైన అటవీ ప్రాంతంలో క్రూర మృగాల మధ్య విధి నిర్వహణ చేసిన పోస్ట్ మాస్టర్

దట్టమైన అటవీ ప్రాంతంలో క్రూర మృగాల మధ్య విధి నిర్వహణ చేసిన పోస్ట్ మాస్టర్

కొడయార్ మెల్తంగల్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లోని 58 ఏళ్ల పోస్ట్‌మాస్టర్ ఫాతిమా రాణి ఆమె కత్తిమీద సాములా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కలక్కాడ్ ముందంతురై టైగర్ రిజర్వ్ లోపల ఉన్న హైడల్ పవర్ ప్లాంట్‌లోని కార్మికులకు వచ్చిన ఉత్తరాలు అందించడానికి దాదాపు 10 కి.మీ రోజూ నడుస్తూ వెళ్తున్నారు. ఆ ప్రాంతంలో తరచుగా వర్షాలు కురుస్తాయి. అంతే కాదు దాదాపు ఎల్లప్పుడూ పొగమంచుతో కప్పబడి ఉంటుంది. ఇదిక్రూర జంతువులతో ఉండటం వల్ల ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టుకుని పని చేస్తున్నారు. ఆమె చిరుతపులులు, దున్నలు, అడవి పందులను దాటుకుంటూ వెళ్లి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు.

క్రూరమృగాలు దాటుకుంటూ కాలిబాటన వెళ్లి ఉత్తరాల బట్వాడా

క్రూరమృగాలు దాటుకుంటూ కాలిబాటన వెళ్లి ఉత్తరాల బట్వాడా

పర్వత ప్రాంతంలో కాలిబాటన ఉన్న రహదారిలో వెళ్లి నిత్యం ఆమె ఉత్తరాలు బట్వాడా చేస్తున్నారు. జంతువులు ఎదురు పడితే చాలా సమయం తాను జంతువులు దాటి వెళ్ళే వరకు ఓపికగా వేచి ఉంటాను లేదా నిశ్శబ్దంగా వాటిని దాటి నడుస్తాను అని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న విద్యుత్ బోర్డు ఉద్యోగులు మరియు అటవీ అధికారులుక్రూర మృగాలు సంచరించే చోటును ఉంటే ఎలా గుర్తించాలో తరచుగా ఆమెకు సలహా ఇస్తారు.అంత కష్టమైన పర్వత ప్రాంతంలోనూ ఆమె పని చేసే క్రమంలో ఆమె ముఖం మీద చిరునవ్వు చెదరకుండా పని చేస్తున్నారు.

హైడల్ పవర్ ప్లాంట్‌లోని కార్మిక కుటుంబాలకు ఉత్తరాలు అందిస్తున్న పోస్ట్ మాస్టర్

హైడల్ పవర్ ప్లాంట్‌లోని కార్మిక కుటుంబాలకు ఉత్తరాలు అందిస్తున్న పోస్ట్ మాస్టర్


రోడ్డుకు అడ్డంగా పాములు, పులులు, పులి పిల్లలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటికి ఇబ్బంది కలగకుండా చాటుగా దాగి, అవి వెళ్ళిపోయాక ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. టైగర్ రిజర్వ్‌లో కొడయార్ డ్యామ్ పక్కన ఉన్న నలుముక్కు ఎస్టేట్ సముద్ర మట్టానికి దాదాపు 1,200 మీటర్ల ఎత్తులో ఉంది. గత 25 సంవత్సరాలలో, ఫాతిమా పులులు, చిరుతలు, ఏనుగులు, అడవి పందులు, పాములతో అనేక మార్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అయినప్పటికీ భయపడకుండా అటవీ అధికారులు, పోలీసు సిబ్బంది మరియు డ్యామ్ సమీపంలో నివసిస్తున్న ఎనిమిది మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆమె బాహ్య ప్రపంచంతో సంబంధం కొనసాగించేలా ఉత్తరాలు చేరవేస్తుంది.

మొబైల్ నెట్ వర్క్ కూడా లేని చోట ఆమె సాహసోపేతమైన ప్రయాణం

మొబైల్ నెట్ వర్క్ కూడా లేని చోట ఆమె సాహసోపేతమైన ప్రయాణం


ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేనందున, తపాలా శాఖ జారీ చేసిన రూరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (RICT) పరికరంలో రికార్డులను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉన్నందున ఆమె ప్రతిరోజూ 5 కిలోమీటర్లు నడిచి బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి, ఆపై తిరిగి వస్తుంది. దాదాపు 25 సంవత్సరాల క్రితం తాను ఉద్యోగం ప్రారంభించినప్పుడు ఎంతో పిరికిదానిగా ఉన్నానని, కానీ ఇప్పుడు తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానని ఆమె చెప్పారు. నలుముక్కు టీ ఎస్టేట్‌లో నివాసముంటున్న ఆమె గతంలో టీ ఫ్యాక్టరీలో నాలుగేళ్లపాటు పనిచేసి టీ ఆకులను కూడా కోసింది. ఆమె ఈ రోజు ఉన్న స్థితికి రావడానికి ఆమె ఎన్నో అసమానతలను అధిగమించింది.

పట్టుదల, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్తున్న ఫాతిమా రాణి

పట్టుదల, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్తున్న ఫాతిమా రాణి

1997లో, ఆమెకు 33 ఏళ్లు ఉన్నప్పుడు, ఆమె బ్రాంచికి పోస్ట్‌మాస్టర్‌గా నియమితులయ్యారు. అంబసముద్రం పోస్టాఫీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్‌పి బాలాజీ మాట్లాడుతూ ఫాతిమా ఒంటరిగా అటవీ మార్గం గుండా వెళ్లడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. మహిళ అయినా సరే తమపై కాస్త పట్టుదల మరియు నమ్మకంతో ఏ ఉద్యోగంలోనైనా నిలదొక్కుకోవాలనిఫాతిమా తన సాహసోపేతమైన విధి నిర్వహణ ద్వారా చెప్తుంది.

English summary
A female postmaster named Fatima Rani walks 10 km to deliver mails to the workers of a hydel power plant located deep inside Kalakkad Mundanthurai Tiger Reserve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X