ప్రియుడితో కలిసి వరుడ్ని ముక్కలుగా నరికింది
చెన్నై: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రియుడితో కలిసి పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తె అతి దారుణంగా హత్య చేసింది. పెళ్లి కుమారుడిని హత్య చేసిన పెళ్లి కుమార్తె, ఆమె ప్రియడు ఊచలు లెక్కపెడుతున్నారని పోలీసులు చెప్పారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చిత్తుకాడుకు చెందిన రాజా (34) చెన్నై నగరంలోని పాడి ప్రాంతానికి చెందిన సత్య అనే యువతికి ఆగస్టు 8వ తేదిన నిశ్చితార్థం జరిగింది.
నవంబర్ 15వ తేదిన వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి పత్రికలు ముద్రించి అందరికి పంచిపెడుతున్నారు. అయితే సత్య గత 10 సంవత్సరాల నుంచి ఇద్దరు బిడ్డల తండ్రి అయిన సహాయం అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్నది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని రాజాకు సత్య చెప్పింది. అయితే రాజా పట్టించుకోలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటానని సత్యకు చెప్పాడు. ఎలాగైనా రాజాను అంతం చేస్తే తన పెళ్లి ఆగిపోతుందని సత్య అనుకుంది. ప్రియుడు సహాయంతో కలిసి రాజా హత్యకు ప్లాన్ వేశారు.
ఈనెల 1వ తేదిన సత్య రాజాకు ఫోన్ చేసి కొరటూరు రైల్వేస్టేషన్ దగ్గరకు పిలిపించుకుంది. తరువాత రాజాతో గొడవ పెట్టుకుంది. అప్పటికే అక్కడ మకాం వేసిన సహాయంతో కలిసి రాజాను అతి దారుణంగా హత్య చేసింది.
రాజా తల, మొండెం వేరు చేసింది. మొండెం ముక్కలు ముక్కలుగా చేసి ఓ డబ్బాలో వేసి నిర్జనప్రదేశంలో విసిరి వేశారు. మొదట పోలీసులు గుర్తు తెలియని శవం అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే విచారణలో హత్యకు గురైయ్యింది రాజా అని వెలుగు చూసింది. సత్య, సహాయంను అరెస్టు చేసి విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications